హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

AMOLED Smartphones: రూ.20 వేలలోపు హై క్వాలిటీ డిస్‌ప్లే గల స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నారా?​.. అయితే ఈ 5 ఫోన్లను పరిశీలించండి

AMOLED Smartphones: రూ.20 వేలలోపు హై క్వాలిటీ డిస్‌ప్లే గల స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్నారా?​.. అయితే ఈ 5 ఫోన్లను పరిశీలించండి

Redmi Note 10S

Redmi Note 10S

ఒకప్పుడు ప్రీమియం స్మార్ట్​ఫోన్లలోనే హై క్వాలిటీ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉండేది. కానీ టెక్నాలజీ అప్​డేట్​తో ఇప్పుడు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్లు సైతం AMOLED డిస్​ప్లేతో లాంచ్​ అవుతున్నాయి.

స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థల మధ్య పోటీ కారణంగా బడ్జెట్​ ధరలోనే సూపర్​ ఫీచర్లతో ఫోన్లు విడుదలవుతున్నాయి. ఒకప్పుడు ప్రీమియం స్మార్ట్​ఫోన్లలోనే (smartphones) హై క్వాలిటీ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉండేది. కానీ టెక్నాలజీ అప్​డేట్​తో ఇప్పుడు మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్లు సైతం AMOLED డిస్​ప్లేతో లాంచ్​ అవుతున్నాయి. కేవలం రూ .20 వేలలోపు సూపర్ AMOLED డిస్‌ప్లే గల బెస్ట్​ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఈ బెస్ట్​ స్మార్ట్​ఫోన్లను పరిశీలించండి.

రెడ్‌మి నోట్ 10 ఎస్ (Redmi Note 10S)

రెడ్​మీ నోట్10 ఎస్​ 6.43- అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​​ మీడియాటెక్ హీలియో G95 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 6 జీబీ ర్యామ్​ను అందించింది. ఇది 64 MP క్వాడ్-కెమెరా సెటప్​తో వస్తుంది. దీనిలో 33W ఫాస్ట్ ఛార్టింగ్​ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీని అందించింది.

Hyderabad Metro: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్.. సువర్ణ ఆఫర్ 2021 ప్రకటించిన మెట్రో.. పూర్తి వివరాలు ఇవే..

రియల్‌మీ 8 (Realme 8)

రియల్​మీ 8 కూడా శక్తివంతమైన సూపర్ AMOLED డిస్‌ప్లే గల మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.4 -అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. రెడ్‌మి నోట్ 10 ఎస్​ మాదిరిగానే దీనిలో కూడా మీడియాటెక్ హీలియో G95 SoC ప్రాసెసర్​ని అందించింది. ఇది 64MP క్వాడ్-కెమెరా సెటప్​ కలిగి ఉంటుంది. దీనిలో 5,000mAh భారీ బ్యాటరీని అందించింది.

శామ్సంగ్​ గెలాక్సీ ఎం32 5జీ (Samsung Galaxy M32 5G)

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5జీ స్మార్ట్​ఫోన్​ కూడా సూపర్ AMOLED డిస్​ప్లేతో వస్తుంది. ఇది 6.5 -అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే వైడ్ స్క్రీన్ కంటెంట్, గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 8GB ర్యామ్​ను అందించింది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

UPI Auto pay: రికరింగ్‌ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? ‘యూపీఐ ఆటోపే’ని ఇలా సెటప్ చేయండి..


రెడ్‌మి నోట్ 10 ప్రో (Redmi Note 10 Pro)

షియోమి సబ్​బ్రాండ్​ రెడ్​మీ నుంచి విడుదలైన నోట్10 ప్రోలో కూడా సూపర్ AMOLED డిస్‌ప్లేను అందించింది. ఇది 6.67 -అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ స్నాప్​డ్రాగన్​ 732G ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్​తో వస్తుంది. 64MP క్వాడ్-కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. దీనిలో 5,020mAh బ్యాటరీని అందించింది.

శామ్సంగ్​ గెలాక్సీ F62 (Samsung Galaxy F62)

శామ్‌సంగ్ గెలాక్సీ F62 మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.​ దీనిలో 6.7 -అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను అందించింది. ఇది మీకు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఎక్సినోస్​ 9 ఆక్టా-కోర్ చిప్​సెట్​తో పనిచేస్తుంది. దీనిలో 6 జీబీ ర్యామ్​, 64 ఎంపీ క్వాడ్-కెమెరా సెటప్​ను చేర్చింది.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Smartphones

ఉత్తమ కథలు