TOP 5 SMARTPHONES UNDER RS 15000 LAUNCHED IN 2019 XIAOMI REDMI NOTE 7 PRO REALME 3 MORE SS
2019 Smartphones: రూ.15,000 లోపు టాప్-5 స్మార్ట్ఫోన్లు ఇవే...
ప్రతీకాత్మక చిత్రం
Top 5 Smartphones Under Rs 15,000 | రూ.15,000 లోపు టాప్-5 స్మార్ట్ఫోన్లు ఇవే. వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి. మీకు కావాల్సిన ఫీచర్స్, బడ్జెట్‌కు తగ్గట్టుగా ఫోన్లు ఎంపిక చేసుకోండి.
ఓ మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? కొత్త ఫోన్ కొనేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారా? సాంసంగ్, షావోమీ, రియల్మీ లాంటి కంపెనీలు ఈ ఏడాది పోటాపోటీగా స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేశాయి. ఫోటోగ్రఫీ నుంచి పబ్జీ గేమ్ వరకు... మీ అవసరాలకు తగ్గట్టుగా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరి వాటిలో రూ.15,000 లోపు టాప్-5 స్మార్ట్ఫోన్లు ఇవే. వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి. మీకు కావాల్సిన ఫీచర్స్, బడ్జెట్‌కు తగ్గట్టుగా ఫోన్లు ఎంపిక చేసుకోండి.
Redmi Note 7 Pro (image: @RedmiIndia/twitter)
షావోమీ రెడ్మీ నోట్ 7 ప్రో
రెడ్మీ నోట్ 5 ప్రోతో భారతదేశంలో సంచలనాలు సృష్టించిన షావోమీ రెడ్మీ నోట్ 6 ప్రో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గత నెలలో రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ను ఇండియాలోనే మొదటిసారిగా రిలీజ్ చేయడం విశేషం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం బెస్ట్ ఛాయిస్. సేల్ మార్చి 13న ఫ్లిప్‌కార్ట్‌లో మొదలుకానుంది.
ఇండియాలో షావోమీ, రియల్మీ, ఏసుస్, హానర్ లాంటి కంపెనీలతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న సాంసంగ్... సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రావడం విశేషం. సేల్ మార్చి 7న అమెజాన్‌లో మొదలుకానుంది.
షావోమీ రెడ్మీ నోట్ 7 మొదట చైనాలో రిలీజైంది. స్పెసిఫికేషన్స్ ఆకట్టుకోవడంతో ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అంతా ఎదురుచూశారు. రెడ్మీ నోట్ 7 ప్రోతో పాటు రెడ్మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది షావోమీ. ఈ ఫోన్ సేల్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం ఇది కూడా మంచి ఛాయిసే.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన మరో కంపెనీ రియల్మీ. రియల్మీ 2 మోడల్‌తో ఆకట్టుకున్న కంపెనీ... రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. 3డీ గ్రేడియంట్ డిజైన్, డ్యూడ్రాప్ ఫుల్ స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్, ఏఐ బ్యూటిఫికేషన్, కలర్ ఓఎస్ 6, రైడింగ్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మార్చి 12 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.3జీబీ+32జీబీ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.10,999. ఈ ధరలు మొదటి 10 లక్షల మందికే ఉంటాయి. ఆ తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.
ఇక ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న హానర్ కంపెనీ ఇటీవల హానర్ 10 లైట్ రిలీజ్ చేసింది. ఆక్టాకోర్ కిరిన్ 710 ప్రాసెసర్, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.