గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రకరకాల మోడల్స్ వచ్చాయి. కొత్త ఫీచర్లు, నాచ్ డిస్ప్లే, డ్యూయెల్, ట్రిపుల్ కెమెరాలు, పవర్ఫుల్ ప్రాసెసర్లు, ర్యామ్... ఇలా ఫోన్లన్నీ పోటాపోటీగా రిలీజయ్యాయి. 2019లో కూడా అంతే. జనవరిలోనే ప్రధాన బ్రాండ్లు సరికొత్త స్మార్ట్ఫోన్లతో మార్కెట్లోకి వచ్చేశాయి. వాటిలో టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే. వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇతర కంపెనీల నుంచి పోటీ ఎదుర్కొంటున్న సాంసంగ్... సరికొత్త స్మార్ట్ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. 'ఇన్ఫినిటీ-వీ' పేరుతో తొలిసారిగా నాచ్ డిస్ప్లేతో సాంసంగ్ రూపొందించిన ఫోన్లు ఇవి. ఫిబ్రవరి 5 నుంచి అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో సేల్ మొదలవుతుంది.
Read This:
Will you marry me?: వాయిస్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నలు... గూగుల్ ఫన్నీ రిప్లై

గెలాక్సీ ఎం10
సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.2 అంగుళాల హెచ్డీ+, 1520x720 పిక్సెల్స్ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7870
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: ఓషియన్ బ్లూ, చార్కోల్ బ్లాక్
ధర:
2జీబీ+16జీబీ- రూ.7,990
3జీబీ+32జీబీ- రూ.8,990

సాంసంగ్ ఎం20
సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.3 అంగుళాల హెచ్డీ+, 2340x1080 పిక్సెల్స్
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7904
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: ఓషియన్ బ్లూ, చార్కోల్ బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- రూ.10,990
4జీబీ+64జీబీ- రూ.12,990
హానర్ 10 లైట్
హానర్ నుంచి రిలీజైన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. షావోమీ, ఏసుస్, రియల్మీ లాంటి బ్రాండ్లకు పోటీగా కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తోంది హానర్.
Read This:
Facebook Tips: మీ ఫేస్బుక్లో చేయకూడని 9 అంశాలివే...

హానర్ 10 లైట్
హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.21 అంగుళాల హెచ్డీ+, 2340x1080 పిక్సెల్స్
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: కిరిన్ 710
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 24 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
హువావే వై9 (2019)
హువావే వై9 మోడల్ గతంలోనే ఉంది. కానీ 2019 మోడల్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది కంపెనీ. రియర్, ఫ్రంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే డ్యుయెల్ కెమెరా, నాచ్‌తో ఫుల్ వ్యూ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు.
Read This:
Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

హువావే వై9
హువావే వై9 (2019) స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+, 2340x1080 పిక్సెల్స్
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: కిరిన్ 710
రియర్ కెమెరా: 16+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
హానర్ వ్యూ 20
ఇటీవల కాలంలో యూజర్లను ఆకట్టుకున్న స్మార్ట్‌ఫోన్ హానర్ వ్యూ 20. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు విశేషంగా ఉన్నాయి. హానర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్ డిస్ప్లే లేదు. నాచ్ డిస్ప్లేను పంచ్ హోల్ డిస్ప్లేతో రీప్లేస్ చేసి అబ్బురపర్చింది హానర్. అదొక్కటే కాదు 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉండటం మరిన్ని ప్రత్యేకతలు.
Read This:
మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే

హానర్ వ్యూ 20
హానర్ వ్యూ20 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ+, 1080x2310 పిక్సెల్స్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, 91.8 స్క్రీన్-టు-బాడీ రేషియో
ర్యామ్: 6 జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ, 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ కిరిన్ 980
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ పై, మ్యాజిక్ యూఐ 2.0
కలర్స్: మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటమ్ రెడ్
ధర:
6జీబీ+128జీబీ- సుమారు రూ.37,999
8జీబీ+256జీబీ- సుమారు రూ.45,999
Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
JioRail App: జియో యూజర్ల కోసం ప్రత్యేకంగా రైల్ యాప్ రిలీజ్
Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?