Home /News /technology /

TOP 5 MOST FUEL EFFICIENT PETROL CARS IN INDIA UMG GH

Fuel Efficient Cars: ఇండియాలో టాప్ 5 కార్లు ఇవే.. మైలేజ్‌లో వీటికి మించినవి లేవసలు..!

ఇండియాలో టాప్ 5 కార్లు ఇవే.. మైలేజ్‌లో వీటికి మించినవి లేవసలు..!

ఇండియాలో టాప్ 5 కార్లు ఇవే.. మైలేజ్‌లో వీటికి మించినవి లేవసలు..!

కస్టమర్లు కారు ఫీచర్లలో చూసే మొదటి అంశం, దాని ఫ్యూయల్ కెపాసిటీ. ఎక్కువ మైలేజీ ఇచ్చే మెడళ్లపైనే కస్టమర్లు ఆసక్తి చూపుతారు. మీరు ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కోసం చూస్తుంటే.. ఈ లిస్ట్ మీకోసమే..

కొత్త కారు కొనాలనుకునే వారు తమ బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ మోడల్‌ కోసం చూస్తుంటారు. ఇందుకు కారు ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పోలుస్తారు. అయితే కస్టమర్లు కారు ఫీచర్లలో చూసే మొదటి అంశం, దాని ఫ్యూయల్ కెపాసిటీ. ఎక్కువ మైలేజీ ఇచ్చే మెడళ్లపైనే కస్టమర్లు ఆసక్తి చూపుతారు. మీరు ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కోసం చూస్తుంటే.. ఈ లిస్ట్ మీకోసమే..

* Maruti Suzuki S-Presso - 25.3 kmpl
కొద్ది రోజుల క్రితం మారుతీ సుజుకి ఇండియన్ మార్కెట్లో S-ప్రెస్సో ట్వీక్డ్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త S-ప్రెస్సో ఇప్పుడు కొత్త 3-సిలిండర్ 1.0 L K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజిన్‌తో వస్తుంది. ఇది 65.7 bhp పవర్, 89 nm టార్క్‌తో వస్తుంది. ఈ కొత్త ఇంజన్ మారుతి సుజుకి ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, AGSతో కలిసి.. 17% ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. S-ప్రెస్సో 25.3 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది.

* Maruti Suzuki Celerio - 26.68 kmpl
మారుతీ సుజుకి 2021లో కొత్త తరం సెలెరియోను విడుదల చేసింది. ఇది కొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో రిలీజ్ అయింది. దీంట్లోని 3-సిలిండర్ 1.0 L K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజన్ 65.7 bhp పవర్‌ను, 89 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AGSతో ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫీచర్‌తో వస్తుంది. దీని K10C ఇంజన్‌, AGS, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్‌ వంటివన్నీ కలిపి ఈ కారు 26.68 kmpl మైలేజ్ అందిస్తుంది.

 ఇదీ చదవండి: రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు.. ఈ రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు !

* Maruti Suzuki WagonR - 25.19 kmpl
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 1.0 ఎల్ కె సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వివిటి ఇంజన్, 1.2 ఎల్ కె సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వివిటి ఇంజన్‌లను కలిగి ఉంది. మారుతి సుజుకి రెండు ఇంజన్ ఆప్షన్‌లకు ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, AGSని అందిస్తోంది. ఈ ఫీచర్లతో 1.2 L వెర్షన్ 24.43 kmpl మైలేజ్, 1.0 L వెర్షన్ 25.19 kmpl మైలేజ్‌ అందిస్తాయి.

* Maruti Suzuki Swift - 23.76 kmpl
మారుతి సుజుకి స్విఫ్ట్ థర్డ్ జెనరేషన్ మోడల్.. 1.2 L డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT BS 6 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AGSతో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్‌తో కూడిన AGS వేరియంట్ 23.76 kmpl మైలేజ్ అందిస్తుంది.



* Maruti Suzuki Dzire - 24.12 kmpl
మారుతి సుజుకి డిజైర్.. దేశంలో అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్ల జాబితాలో ఒకటి. స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, AGSతో కలిపి దీని 1.2 L డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT BS 6 ఇంజిన్‌.. 24.12 kmpl మైలేజ్‌ అందిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Budget cars, MARUTI SUZUKI, New cars, Petrol

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు