Home /News /technology /

TOP 5 ELECTRIC SCOOTERS CAN DRIVE WITHOUT DRIVING LICENSE IN INDIA UMG GH

Electric Scooters: డ్రైవింగ్ లైసెన్స్ లేదా.. డోంట్‌వర్రీ! ఈ ఐదు స్కూటర్లు మీకోసమే ప్రత్యేకంగా..!

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే ఎలక్ట్రిక్ బైక్‌లు ఏంటో తెలుసా.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే ఎలక్ట్రిక్ బైక్‌లు ఏంటో తెలుసా.

ఏ దేశంలోనైనా వాహనాలను డ్రైవ్‌ (DRIVING) చేయాలంటే సంబంధిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving Licence) తప్పనిసరిగా ఉండాలి. లేదంటా చట్టరీత్యా నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. అయితే ఇండియాలో కొన్ని రకాల వాహనాలను డ్రైవ్‌ చేయడానికి లైసెన్స్‌ అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
ఏ దేశంలోనైనా వాహనాలను డ్రైవ్‌ చేయాలంటే సంబంధిత driving licence తప్పనిసరిగా ఉండాలి. లేదంటా చట్టరీత్యా నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. అయితే ఇండియాలో కొన్ని రకాల వాహనాలను డ్రైవ్‌ చేయడానికి లైసెన్స్‌ అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి. ఇండియాలోని రోడ్‌లు అతిపెద్ద ట్రక్కుల నుంచి చిన్న ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వరకు నిండి ఉన్నాయి. భారతదేశ చట్టాల ఆధారంగా, డ్రైవ్‌ చేస్తున్న వెహికల్‌ ఆధారంగా లైసెన్స్ అవసరం. ఉదాహరణకు అవసరాల ఆధారంగా హెవీ మోటర్ వెహికల్ (HMV) లేదా లైట్ మోటార్ వెహికల్ (LMV) వంటి లైసెన్స్ అవసరం. అయితే ఎటువంటి అధికారిక లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయగల వాహనాలు కొన్ని ఉన్నాయి. ఈ నిబంధన ద్వారా భారతీయులు ఎటువంటి ప్రత్యేక పర్మిట్ లేకుండా కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను డ్రైవ్‌ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే.. గరిష్టంగా 25 kmph వేగం, 250 వాట్ల గరిష్ట పవర్ అవుట్‌పుట్ కలిగిన Electric Bikes నడపవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపగల అలాంటి వెహికల్స్‌ ఏవో తెలుసుకోండి.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2(Hero Electric Flash E2)
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 అనే ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్‌ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్ 48-వోల్ట్ 28 Ah లిథియం-అయాన్ బ్యాటరీపై 250-వాట్ ఎలక్ట్రిక్ మోటార్ నుంచి శక్తిని తీసుకుంటుంది. ఇది గరిష్టంగా 25 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ బరువు కేవలం 69 కిలోలు మాత్రమే ఉంటుంది. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.59,099గా ఉంది.

ఇదీ చదవండి: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మాస్టర్ కార్డ్‌పై ఆంక్షల ఎత్తివేత.. త్వరలోనే కొత్త క్రెడిట్ కార్డులు


హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ5(Hero Electric Optima E5)
ఈ జాబితాలో hero ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ5 రెండో స్కూటర్. ఇది 250-వాట్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫ్లోర్‌బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేసిన లిథియం-అయాన్/లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా EV ఛార్జ్‌కి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది, గంటకు 42 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది.

ఇదీ చదవండి: అబ్బో ఈమెది మామూలు బుర్ర కాదయ్యో..! చిన్న ట్రాకర్‌తో బాయ్‌ఫ్రెండ్‌నే మర్డర్ చేసింది.. యాపిల్ యూజర్స్ జర జాగ్రత..!


హాప్ లియో(HOP LEO)
హాప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌లతో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటి. ఇది USB ఛార్జింగ్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెన్స్, రిమోట్ కీ, సైడ్ స్టాండ్ సెన్సార్, యాంటీ-థెఫ్ట్ అలారం, GPS వంటి ఇతర ఫీచర్లతో వస్తుంది. అంతేకాకుండా స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పై 70 నుండి 125 కిమీల దూరం ప్రయాణిస్తుంది.

ఇదీ చదవండి: రష్యాలానే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైందా..? చైనా ప్రత్యర్థి ఎవరంటే..?


జాంటీ ప్రో(Jaunty Pro)
AMO ఎలక్ట్రిక్ బైక్స్ సంస్థ జాంటీ ప్రో స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 249 W ఎలక్ట్రిక్ మోటార్ పై జాంటీ ప్రో రన్‌ అవుతుంది. ఇది ఒక ఛార్జ్‌కి 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. 6 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.



జాయ్ ఇ-బైక్ మాన్స్టర్(Joy E-bike Monster)
జాయ్ ఇ-బైక్ మాన్‌స్టర్ పేరుకు తగ్గట్లు చాలా భిన్నంగా ఉంటుంది. మినీ-బైక్ 250 kW హబ్ మోటార్ పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా EV 73 కిమీ పరిధిని అందించే లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. మినీ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అల్లాయ్ వీల్, వెనుక మోనో-షాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీన్ని రూ.1,10,000కి సొంతం చేసుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Driving licence, Electric Bikes, Hero, India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు