హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Upcoming Cars: ఈ ఏడాది ఇండియాలో లాంచ్ టాప్-5 కార్లు ఇవే.. ప్రత్యేకతలు తెలుసుకోండి..

Upcoming Cars: ఈ ఏడాది ఇండియాలో లాంచ్ టాప్-5 కార్లు ఇవే.. ప్రత్యేకతలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గతేడాది ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో అద్భుతమైన కార్లు (Cars), ఎస్‌యూవీలు (SUVs) విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది అంతకుమించిన లగ్జరీ SUVలు, అధునాతన ఎలక్ట్రిక్ వాహనాలతో సహా కొన్ని కార్లు లాంచ్‌ కానున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

గతేడాది ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో అద్భుతమైన కార్లు (Cars), ఎస్‌యూవీలు (SUVs) విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది అంతకుమించిన లగ్జరీ SUVలు, అధునాతన ఎలక్ట్రిక్ వాహనాలతో సహా కొన్ని కార్లు లాంచ్‌ కానున్నాయి. మొత్తంగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి.. 2023లో చాలానే ఆప్షన్స్ అందుబాటులో ఉండనున్నాయి. మరి వాటిలో టాప్ 5 కార్లు, SUVలు, ఎలక్ట్రిక్ వాహనాల ఏవో ఇప్పుడు చూసేద్దాం. తద్వారా బెస్ట్ కారును ఎంపిక చేసుకోవడం సులభతరం అవుతుంది.

టాటా ఆల్ట్రోజ్ EV

టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న Altroz ​​ఈవీని ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇచ్చే ALFA ప్లాట్‌ఫామ్‌పై బిల్డ్ చేశారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్, బ్యాటరీ ప్యాక్‌తో సహా Nexon EVలో ఇచ్చిన ఫీచర్లతోనే లాంచ్ అవ్వొచ్చు. Altroz ​​ఈవీలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీతో బ్యాటరీ స్టేటస్, ఛార్జింగ్ హిస్టరీ వంటి ముఖ్య వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాదు, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనవచ్చు.

ఎమ్‌జీ కామెట్ (MG Comet)

MG కామెట్ అనేది MG మోటార్ ఇండియా నుంచి ఈ ఏడాది రిలీజ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు. రెండు-డోర్లతో వస్తున్న ఇది 25-kWh బ్యాటరీ, 50 kW మోటారును ఆఫర్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150-200 కిమీల రేంజ్‌ను ఇస్తుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) సెల్స్‌తో దీనిని లాంచ్ చేయనున్నారు. ఈ కారులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 10.25-అంగుళాల డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే, ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు ఉంటాయి. MG కామెట్ స్మార్ట్, స్టైలిష్ అర్బన్ EVగా వస్తుంది. ఇది EV మొబిలిటీ కేటగిరీలో కొత్త ట్రెండ్‌ను స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొత్త, హాట్-లుకింగ్ డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్, అదనపు ఫీచర్లతో ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా కాస్మోటిక్ చేంజెస్‌తో వచ్చే ఈ ఫేస్‌లిఫ్ట్‌లో 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఇంటీరియర్ ఎలిమెంట్స్, మరిన్ని ఫీచర్లు ఉంటాయి. SUV ఇండియన్ వెర్షన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఎక్స్‌ట్రా ఫీచర్లు ఉండవచ్చు. ఎందుకంటే ఈ కారు ప్లాట్‌ఫామ్‌ను లోకల్‌గా తయారు చేశారు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) కాంపాక్ట్ SUVగా 2023, ఏప్రిల్ నెలలో లాంచ్ కానుందని సమాచారం. Fronx కారు స్టార్టింగ్ ప్రైస్ సుమారు రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఈ కారు తొమ్మిది విభిన్న కలర్ ఆప్షన్లతో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. హై-ఎండ్ వేరియంట్ల ధరలు ఎక్కువగా ఉండొచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

ఇండోనేషియాలో జరిగిన GIIAS 2021 మోటార్ షోలో, హ్యుందాయ్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త డిజైన్ నెక్స్ట్ జనరేషన్ టక్సన్ ఆధారంగా రూపొందించారు. ఈ కారు ముందు భాగంలో పొడవైన, పారామెట్రిక్ గ్రిల్‌ ఉంటుంది. ఇక టెయిల్‌లైట్లు మునుపటి జనరేషన్ కంటే ఎక్కువ యాంగ్యులర్‌గా ఉంటాయి. టెయిల్‌లైట్ల రెండు వైపులా రెండు క్రీజస్ ఉండగా, వాటిని కనెక్ట్ చేయడానికి ఒక ప్లాస్టిక్ ప్యానెల్ ఉంటుంది. ఇక కారు ట్రంక్ రీడిజైన్‌తో వస్తుంది. వెనుక భాగంలో కొత్త బంపర్ ఉంటుంది.

First published:

Tags: CAR, Cars

ఉత్తమ కథలు