టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

నెలలో నాలుగైదు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అవుతుంటే ఏ ఫోన్ కొనాలో తెలియక తికమకపడుతున్నారా? టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్, వాటి ఫీచర్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: September 7, 2018, 4:47 PM IST
టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!
నెలలో నాలుగైదు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అవుతుంటే ఏ ఫోన్ కొనాలో తెలియక తికమకపడుతున్నారా? టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్, వాటి ఫీచర్స్ తెలుసుకోండి.
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మేకర్స్ ఈ ఏడాది వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఒకే కంపెనీ నాలుగైదు ఫోన్లు రిలీజ్ చేస్తూ యూజర్లకు గాలమేస్తున్నాయి కూడా. షావోమీ కంపెనీ మొన్న ఒక్క రోజే మూడు ఫోన్లు రిలీజ్ చేశాయి. అన్నీ బడ్జెట్ ఫోన్లే. మంచి డిస్‌ప్లే, డీసెంట్ ప్రాసెసర్, ఆకట్టుకునే యూఐ, కావాల్సినంత బ్యాటరీ బ్యాకప్‌... ఇవన్నీ మీ బడ్జెట్‌లోనే వచ్చే 5 స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి.

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!, Top 5 Budget Android Smartphones to Buy, September 2018 Edition
షావోమీ రెడ్‌మీ 6 ప్రో


షావోమీ రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6 ప్రో ఎంఐ ఏ2 లైట్ రీబ్రాండ్‌గా చెప్పుకోవచ్చు. నాచ్‌ డిస్‌ప్లే, అల్యూమినియం బాడీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌ను క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌తో రూపొందించింది షావోమీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, ఎంఐ బ్యాండ్ అన్‌లాక్, స్మార్ట్ అన్‌లాక్ లాంటి ఫీచర్లున్నాయి. రెండు సిమ్ కార్డులతో పాటు మెమొరీ కార్డు వాడుకోవడానికి డెడికేటెడ్ స్లాట్ ఉంది.

రెడ్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.84 అంగుళాలఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280 x 1080 పిక్సెల్స్
ర్యామ్: 3 జీబీ, 4 జీబీఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 9.6
కలర్స్: బ్లాక్, బ్లూ, గోల్డ్, రెడ్
ధరలు:
3 జీబీ + 32 జీబీ- రూ.10,999
4 జీబీ + 64 జీబీ- రూ.12,999

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!, Top 5 Budget Android Smartphones to Buy, September 2018 Edition
షావోమీ రెడ్‌మీ 6


షావోమీ రెడ్‌మీ 6
రెడ్‌మీ 6 కూడా మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో తయారైన ఫోన్. 3 జీబీ + 32 జీబీ, 4 జీబీ + 64 జీబీ వేరియంట్లతో రెండు ఫోన్లున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఫేస్ అన్‌లాక్, డెడికేటెడ్ మైక్రో ఎస్డీ స్లాట్ ఉన్నాయి.

రెడ్‌మీ 6 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
ధర:
3 జీబీ + 32 జీబీ- రూ.7,999
4 జీబీ + 64 జీబీ- రూ.9,499

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!, Top 5 Budget Android Smartphones to Buy, September 2018 Edition
షావోమీ రెడ్‌మీ 6ఏ


షావోమీ రెడ్‌మీ 6ఏ
రెడ్‌మీ 6ఏ ఫోన్ కూడా మీడియాటెక్ హీలియో ఏ22 చిప్‌సెట్‌తో రూపొందింది. ఈ ఫోన్ 2 జీబీ + 16 జీబీ, 3 జీబీ+ 32 జీబీ వేరియంట్లతో రెండు ఫోన్లను పరిచయం చేసింది షావోమీ. రెడ్‌ మీ 5ఏ ఫోన్‌కు అప్‌‌గ్రేడ్ వర్షనే రెడ్‌మీ 6ఏ. మెమొరీ కార్డ్ స్లాట్, ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లున్నాయి.

రెడ్‌మీ 6ఏ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ22
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ
ధర:
2 జీబీ + 16 జీబీ- రూ.5,999
3 జీబీ + 32 జీబీ- రూ.6,999

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!, Top 5 Budget Android Smartphones to Buy, September 2018 Edition
హానర్ 7ఎస్


హానర్ 7 ఎస్
హువావే సబ్‌బ్రాండ్ అయిన హానర్... బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన మరో ఫోన్ 7ఎస్. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈ ఫోన్ షావోమీ రెడ్‌మీ 6 సిరీస్‌కు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే షావోమీ కూడా 6 సిరీస్‌లో రెండు ఫోన్లను మీడియాటెక్ ప్రాససెర్‌తో రూపొందించింది.

హానర్ 7 ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+, 720x1440 పిక్సెల్స్, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ ఎంటీ 6739
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3020 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.6,999

టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!, Top 5 Budget Android Smartphones to Buy, September 2018 Edition
రియల్‌మీ 2


రియల్‌మీ 2
రియల్‌మీ 2 ఫోన్ కూడా బడ్జెట్ మార్కెట్‌లో గట్టిపోటీ ఇస్తున్న స్మార్ట్‌ఫోనే. నాచ్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ ప్రత్యేకత. కెమెరా విషయానికొస్తే ఏఐ బ్యూటిఫికేషన్ 2.0, రియల్ టైమ్ ఏఆర్ స్టిక్కర్స్, ఫ్రంట్ కెమెరా హెచ్‌డీఆర్, బొకే మోడ్ లాంటి ఫీచర్లున్నాయి. మోటో జీ5 ప్లస్, షావోమీ రెడ్‌ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రో, రెడ్‌మీ 6 సిరీస్ లాంటి టాప్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తోంది రియల్‌మీ 2 ఫోన్.

రియల్‌మీ 2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+, 720x1520 పిక్సెల్స్, 19:9 యాస్పెక్స్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4230 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1, కలర్ ఓఎస్ 5.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర:
3 జీబీ + 32 జీబీ- రూ.8,990
4 జీబీ + 64 జీబీ- రూ.10,990

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

స్పోర్ట్స్, రేసింగ్ గేమ్ యాప్స్‌దే హవా!

జర్నలిస్టుల కోసం ప్రత్యేక సెర్చింజన్!

సెప్టెంబర్ 12న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!
Published by: Santhosh Kumar S
First published: September 7, 2018, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading