Home /News /technology /

TOP 5 BEST BUDGET TABLETS TO BUY FOR CHILDREN UMG GH

Budget Tablets: పిల్లల కోసం ట్యాబ్ కొనాలనుకుంటున్నారా..? ఈ టాప్-5 బడ్జెట్ ట్యాబ్లెట్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఎడ్యుకేషనల్ ఈయర్ ప్రారంభమైన నేపథ్యంలో.. పిల్లల కోసం కొనుగోలు చేయగల 5 బెస్ట్ బడ్జెట్ ట్యాబ్స్ ఏవో చూద్దాం.

కోవిడ్-19 తర్వాత స్కూల్ స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం మొబైల్ ఫోన్‌లతో పాటు బడ్జెట్ ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్‌లను చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పటికీ ఎడ్యుకేషన్ అవసరాల కోసం ట్యాబ్లెట్ల వాడకం కొనసాగుతోంది. కొత్త ఎడ్యుకేషనల్ ఈయర్ ప్రారంభమైన నేపథ్యంలో.. పిల్లల కోసం కొనుగోలు చేయగల 5 బెస్ట్ బడ్జెట్ ట్యాబ్స్ ఏవో చూద్దాం.

* Xiaomi Pad 5
ఇది 11-అంగుళాల WQXGA(2560 x 1600p) LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ సపోర్ట్‌తో వస్తుంది. అడ్రినో 640 GPU, ఆండ్రాయిడ్ 11-బేస్డ్ MIUI 13 OS, 6GB LPDDR4X ర్యామ్‌తో రన్ అవుతుంది. ఈ డివైజ్‌లో 7nm క్లాస్ 2.96GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌సెట్‌ ఉంది. ఇది మంచి పనితీరును అందిస్తుంది. 13MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలను అందించారు. ఈ డివైజ్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌ ఉండే 8,720mAh బ్యాటరీతో వస్తుంది. ఇది దాదాపు 90 నిమిషాల్లో డివైజ్‌ను సున్నా నుంచి 100 శాతానికి పవర్ అప్ చేయగలదు. షియోమి ప్యాడ్ 5 రెండు స్టోరేజ్‌లలో వస్తుంది. 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్ల ధర వరుసగా రూ.26,999, రూ.28,999 వరకు ఉంది.

* Apple iPad 9th Gen (2022)
ఈ ట్యాబ్ 10.2-అంగుళాల రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో వినియోగించిన ట్రూ టోన్ టెక్నాలజీతో ఫోటోలు, వీడియోలు మరింత సహజంగా కనిపిస్తాయి. దీంట్లోని A13 బయోనిక్ చిప్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ సిరీస్‌లో మునుపటి తరం ట్యాబ్ కంటే 20 శాతం వరకు పనితీరును పెంచుతుందని కంపెనీ పేర్కొంది. ఇది అత్యధికంగా అమ్ముడైన క్రోమ్‌బుక్ కంటే మూడు రెట్లు వేగవంతమైనదని, అత్యధికంగా అమ్ముడవుతున్న ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంటే ఆరు రెట్లు వేగవంతమైనదని నివేదికలు చెబుతున్నాయి. iPad 9th Gen Wi-Fi మోడల్‌ రూ. 30,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. Wi-Fi + సెల్యులార్ మోడల్స్ ధర రూ. 42,900 నుంచి ప్రారంభమవుతుంది.

* Nokia T20
ఇది 10.36-అంగుళాల 2K (2000 x 1200p) IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 400 nits బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. 12nm క్లాస్ 64-బిట్ ఆర్కిటెక్చర్-బేస్డ్ 1.8GHz Unisoc T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Mali-G52 GPU, ఆండ్రాయిడ్ 11, 3GB/4GB LPDDR4 RAM, 32GB లేదా 64GB స్టోరేజ్‌తో వస్తుంది. LED ఫ్లాష్‌తో కూడిన 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 10W ఛార్జర్ సపోర్ట్‌తో కూడిన 8,200mAh బ్యాటరీ వంటివి అదనపు ఫీచర్లు. నోకియా T20 (Wi-Fi ఓన్లీ మోడల్) రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 3GB RAM + 32GB స్టోరేజ్, 4GB RAM + 64GB స్టోరేజ్ ధరలు వరుసగా రూ. 15,499, రూ. 16,499. LTE+Wi-Fi మోడల్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 18,499కి వస్తుంది.

* Realme Pad mini
రియల్‌మీ ప్యాడ్ మినీ 8.7-అంగుళాల WXGA+ (1340×800p) LCD స్క్రీన్, 12nm క్లాస్ 2GHz UNISOC T616 ఆక్టా-కోర్ Mali-G57 GPU, డ్యూయల్ స్పీకర్లు, సింగిల్ మైక్, 3GB/4GB LPDDR4X RAMతో వస్తుంది. 34 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11-బేస్డ్ రియల్‌మీ UIతో డివైజ్ రన్ అవుతుంది. 8MP వెనుక కెమెరా, 5MP 105-డిగ్రీ ఫ్రంట్ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 6,400mAh బ్యాటరీ వంటివి దీంట్లోని అదనపు ఫీచర్లు. 3GB RAM + 32GB స్టోరేజ్ మోడల్ Wi-Fi, LTEలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.10,999, రూ.12,999. 4GB + 64GB వేరియంట్ కూడా Wi-Fi, LTEలో వరుసగా రూ.12,999, రూ. 14,999కి లభిస్తుంది.

* Motorola G70 Tab
ఇది 2000 x 1200p రిజల్యూషన్‌తో 11-అంగుళాల TDDI LCD స్క్రీన్‌తో వస్తుంది. 400 nits పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్ TUV-సర్టిఫైడ్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్‌లతో వస్తుంది. దీంట్లో రెండు మైక్‌లు, నాలుగు డాల్బీ అట్మోస్‌ స్పీకర్లు ఉన్నాయి. మోటొరోలా G70 ట్యాబ్ 12nm క్లాస్ MediaTek Helio G90T చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 800MHz Mali-G76 3EEMC4 GPU, Android 11-బేస్డ్ OS, 4GB/6GB RAM, 64GB స్టోరేజ్, 13MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 20W ఛార్జర్ సపోర్ట్‌తో 7,700mAh బ్యాటరీ.. వంటి ఫీచర్లతో డివైజ్ లాంచ్ అయింది. ఇండియాలో దీని ధర రూ.22,999.
Published by:Mahesh
First published:

Tags: Android, Apple, Mobile, Tablet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు