ఈ రోజుల్లో ఒక స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉత్తమమైనదా, కాదా అనేది అందులోని కెమెరాల క్వాలిటీ (Cameras Quality)ని బట్టే చాలామంది నిర్ణయిస్తున్నారు. బెస్ట్ కెమెరాలతో వచ్చే ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. బడ్జెట్ రూ.20,000 లోపు (Under Rs.20,000) ఉంటే.. ఈ న్యూస్ మీకోసమే! వరల్డ్-క్లాస్ కెమెరాలతో వచ్చే టాప్ 10 స్మార్ట్‌ఫోన్లు (Top Camera Phones) ఏవో ఇప్పుడు చూద్దాం.
* రెడ్‌మీ నోట్ 10 ప్రో
రెడ్‌మీ నోట్ 10 ప్రో రూ.20000 లోపు ధరతో అద్భుతమైన కెమెరాలతో వస్తుంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరా అందించారు. 64MP + 8MP + 5MP+ 2MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇందులో 33W ఛార్జర్, 5020 mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 732G క్రియో 470 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లున్నాయి.
* వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G
వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G కూడా క్వాలిటీ కెమెరాలతో లాంచ్ అయ్యింది. ఇందులో EISతో 64MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరాగా 16MP సోనీ IMX471 ఆఫర్ చేశారు. ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS, Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్, 33W SuperVOOC ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
* శాంసంగ్ గెలాక్సీ M32
శాంసంగ్ M32 క్వాడ్ కెమెరా సెటప్‌తో సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ క్వాడ్ కెమెరా సెటప్‌లో 64MP (F 1.8) ప్రైమరీ కెమెరా కాగా 8MP (F2.2) అల్ట్రా వైడ్ కెమెరాగా.. 2MP (F2.4) డెప్త్ కెమెరాగా 2MP (2.4) మాక్రో కెమెరాగా అందించారు. సెల్ఫీల కోసం 20MP (F2.2) ఫ్రంట్ కెమెరాని ఆఫర్ చేశారు. ఇందులో 6000 mAh బ్యాటరీ 6.4-అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ U-కట్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ రిజల్యూషన్, 800 Nits హై బ్రైట్‌నెస్ మోడ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, UI 3.1, MediaTek హీలియో G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
* వివో Y73
వివో Y73లో వెనుక వైపు 64MP+2MP+2MP కెమెరాలు, ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఆఫర్ చేశారు. ఆండ్రాయిడ్ 11.1-బేస్డ్ Funtouch OS తో వచ్చే ఈ ఫోన్‌లో 6.44 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 4000mAh బ్యాటరీ, టైప్-C పోర్ట్ 33W ఫ్లాష్ ఛార్జింగ్ వంటివి మెయిన్ ఫీచర్లు. ఇది MediaTek Helio G95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
* ఒప్పో A74 5G
ఒప్పో క్వాడ్ కెమెరా సెటప్‌తో 5000 mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఇందులో 48MP ప్రైమ్ కెమెరా + 2MP మాక్రో + 2MP డెప్త్ లెన్స్ అందించారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఆక్టా-కోర్ డ్యూయల్-మోడ్ Qualcomm 5G ప్రాసెసర్, 6.49 అంగుళాల FHD+ పంచ్-హోల్ డిస్‌ప్లే, 5000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఇందులోని హైలెట్ ఫీచర్స్!
* రియల్‌మీ నార్జో 50 5G
రియల్‌మీ నార్జో 50 5G ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అయింది. ఇందులో వెనుకవైపు డ్యూయల్-LED ఫ్లాష్, HDR, పనోరమా వంటి ఫీచర్స్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G అనే పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్‌తో వస్తుంది.
* నోకియా G21 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ AI రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. పవర్‌ఫుల్ AI ఇమేజింగ్ మోడ్‌లు, OZO స్పేషియల్ ఆడియోతో 50MP ట్రిపుల్ AI రియర్ కెమెరాలు అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ కెమెరా అందించారు. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఆఫర్ చేశారు. 5050 mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఇందులోని మెయిన్ ఫీచర్లు. ఈ ఫోన్ Unisoc T606 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది.
* లావా అగ్ని 5G
లావా అగ్ని 5G మంచి కెమెరా ఫోన్‌గా నిలుస్తోంది. ఇందులో Lava Quad AI-ఎనేబుల్డ్ 64 MP ప్రైమరీ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 64 MP ప్రైమరీ కెమెరా, 5 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ కెమెరా పొందొచ్చు. 16MP ఫ్రంట్ కెమెరాగా అందించారు. 5000 mAh బ్యాటరీ, 6.78’ అంగుళాల FHD+ 90Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ దీనిలోని బెస్ట్ ఫీచర్స్.
* రెడ్‌మీ నోట్ 11T 5G
రెడ్‌మీ నోట్ 11T 5G అద్భుతమైన డిస్‌ప్లే, ఫోన్లతో వస్తుంది. ఇందులో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో 50MP హై-రిజల్యూషన్ ప్రైమరీ కెమెరాని పొందొచ్చు. సెల్ఫీల కోసం 16 MP ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్, 6nm ప్రాసెస్ ఆధారంగా హైపర్‌ఇంజిన్ 2.0, 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీతో డాట్ డిస్‌ప్లే, 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000mAh బ్యాటరీ దీనిలోని స్పెషల్ ఫీచర్లు!
* పోకో M4 ప్రో 5G
పోకో M4 ప్రో 5G ఫోన్ 50 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5000 mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart phone, Mobiles, New smart phone, Tech news