హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Technology in Home: ఇంట్లో మితిమీరిన టెక్నాలజీ వాడటం మంచిదేనా..? ఈ విషయాలు తెలుసుకోండి

Technology in Home: ఇంట్లో మితిమీరిన టెక్నాలజీ వాడటం మంచిదేనా..? ఈ విషయాలు తెలుసుకోండి

కరోనా కాలంలో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అనేక రంగాల ఉద్యోగుల్లో ఈ రకమైన టెన్షన్ కనిపిస్తోంది.

కరోనా కాలంలో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. అనేక రంగాల ఉద్యోగుల్లో ఈ రకమైన టెన్షన్ కనిపిస్తోంది.

ఒకప్పుడు తన పని తానే చేసుకునేవాడు. కాల క్రమేణా టెక్నాలజీ ఆవిర్భావంతో మెషన్లపై ఎక్కువగా ఆధారపడుతూ శ్రమ తగ్గించుకున్నాడు. ప్రస్తుతమున్న ఆధునిక సాంకేతికత వల్ల దాదాపు అన్ని పనులకు టెక్నాలజీనే ఆశ్రయిస్తున్నాడు. అయితే..

ఒకప్పుడు తన పని తానే చేసుకునేవాడు. కాల క్రమేణా టెక్నాలజీ ఆవిర్భావంతో మెషన్లపై ఎక్కువగా ఆధారపడుతూ శ్రమ తగ్గించుకున్నాడు. ప్రస్తుతమున్న ఆధునిక సాంకేతికత వల్ల దాదాపు అన్ని పనులకు టెక్నాలజీనే ఆశ్రయిస్తున్నాడు. అయితే వచ్చే నాలుగైదేళ్లల్లో కాఫీ పెట్టుకోవడం, టీవీ స్విచ్ ఆన్ చేయడం, వాషింగ్ మెషిన్, భోజనం తదితర చిన్న చిన్న పనులకు కూడా కృత్రిమ మేధస్సు(AI) సాయంతో మంచంపై నుంచే చేసుకోవచ్చు. వింటానికి ఇది బాగానే ఉన్నా మితిమీరిన టెక్నాలజీ వినియోగం వల్ల భవిష్యత్తులో ఎక్కువ ఇబ్బందులకు దారితీసే అవకశాముందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఓ సారి ఆలోచిస్తే కృత్రిమ మేధస్సుతో పనిచేసే కాఫీ మేకర్ చాలా తెలివైంది. ఒక్కసారి మీరు సమయం, కావాల్సిన పదార్థాలు అందులో సెట్ చేస్తే ప్రతిరోజూ దానంతటా అదే ఆ సమయానికి మీకు కాఫీ అందిస్తుంది.

కానీ కొన్నిసార్లు ఎక్కువ సేపు నిద్రించినా లేదా ఆ సమయానికి ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు సిస్టం ఆఫ్ చేస్తే ఓకే.. చేయకపోయినట్లయితే కాఫి మెషి రోజూలాగే తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాఫీ వేడై కిందపడి పోతుంది. కిందపడినా ఫర్వాలేదు.. మీరు ఇంట్లో లేనప్పుడు చిన్నపిల్లలు లేదా మీ పెంపుడు జంతువులు ఉన్నప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీసే అవకాశముంది. ఈ స్మార్ట్ హోంల వల్ల మరిన్ని పర్యవసనాలు రానున్నాయి.

1950లోనే స్మార్ట్ హోం గురించి కథ..

పైన చెప్పిన కృత్రిమ మేధస్సు వ్యవస్థల గురించి 1950లోనే రే బ్రాడ్ బరీ అనే రచయిత రాసిన దేర్ విల్ కం సాఫ్ట్ రెయిన్స్ అనే కథను పోలి ఉంటుంది. అణు విద్యుత్ వినయోగం వల్ల మానవ జాతి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నది అనేది ఇక్కడ ఇతివృత్తం. 2026 నాటికి మానుషులకు మానవ సహాయం అవసరం లేదని ఈ కథలోని స్మార్ట్ హోం గురించి తెలుపుతుంది. ఈ స్మార్ట్ హౌస్.. ఆహారాన్ని ఉడికించి వంటపాత్రలను శుభ్రం చేస్తుంది. మానవులతో సంబంధం లేకుండా పడకగది సిద్ధం చేసేలా ముందుగానే ప్రోగ్రాం చేస్తుంది. ఇంట్లో ఒక్కరు కూడా లేకపోయినా రోజువారీ పనులను ఈ స్మార్ట్ హౌసే చేసుకుంటూ పోతుంది.

దాదాపు 71 ఏళ్ల క్రితం ఈ కథ మొదటిసారి ప్రచురించబడినప్పుడు ఇలాంటి సాంకేతిక ఎప్పటికైనా ఉనికిలోకి వస్తుందా అని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ 2021 నాటికి ఎక్కువ ఎలక్ట్రానికి ఉపకరణాల వాడకంతో నిజమే అనిపిస్తుంది. పూర్తిగా స్మార్ట్ ఉపకరణాలతో ఇంటిని అనుసంధానించడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొన్ని స్వాభావిక నష్టాలను కూడా అధిగమించాలి. ఉదాహరణకు స్మార్ట్ డోర్ నే తీసుకోండి. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ తలుపు ఫేషియల్ ఐడీ ద్వారా ప్రీప్రోగ్రాం చేయడం వల్ల అందులోని డేటా ఆధారంగా సందర్శకులను తానంతటా అదే లోపలకు అనుమతిస్తుంది. దీని ద్వారా మీరు తలుపు దగ్గరకు

రాకుండానే వచ్చేవారిని లోపలకు అనుమతించవచ్చు.

అయితే కృత్రిమ మేధస్సు నేతృత్వంలోని ముఖ గుర్తింపు సాంకేతికత వాస్తవిక రుజువు కాదని కొన్ని అధ్యయనాలు ఇటీవలే నిర్ధారించాయి. శ్వేత వర్ణంతో ఉండే వారితో పోలిస్తే ఆఫ్రికన్-అమెరికన్, ఆసియాకు చెందిన వారి ముఖాలను గుర్తించడంలో ఈ అల్గారిథమ్ లు అంత కచ్చితత్వంతో పనిచేయలేదని 2019లో అమెరికా అధ్యయనంలో తేలింది. మీరు లేనప్పుడు ఎవరైన ఇంట్లోకి చొరబడాలంటే మీది లేదా మీ బంధువు ఫొటో చూపించి కూడా సులభంగా వెళ్లవచ్చు. కేవలం ఫొటో గుర్తింపు విఫలమవడం వల్ల ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించడం ఎంతో ప్రమాదకరమో ఊహించుకంటే అర్థమవుతుంది.

ఇంట్లోని అధునాతన ఉపకరణాలు ముఖ్యంగా పిల్లలకు లేదా పెద్దవారికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. పిల్లలు దగ్గర ఉన్నారని తెలియకుండానే ఎవరైనా సులభంగా వాషింగ్ మెషిన్ ను మార్చవచ్చు. అంతేకాకుండా యంత్రం లోపల పిల్లలు లాక్ అయ్యే సందర్భాలు కూడా సాదారణంగా జరుగే అవకాశముంది. రోజూ నిర్దిష్ట సమయాల్లో ఓ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నింపేలా గీజర్ ను బాత్ టబ్ తో ప్రోగ్రాం చేయడం వల్ల కూడా ప్రమాదముంది. మీరు లేనప్పుడు కుటుంబంలోని ఉండే వృద్ధులు లేదా పిల్లలు ఆ వ్యవస్థను స్విచ్ ఆఫ్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఉత్పత్తులను రూపొందించే సంస్థలకు ఈ నష్టాల గురించి బాగా తెలుసు. కానీ వారు వినియోగదారులను జాగ్రత్తగా వ్యవహరించడాన్ని సమర్థిస్తారు. అంతేకాకుండా అన్ని ఉపకరాణాల కోసం మ్యానువల్ షటాఫ్ ఫంక్షన్లను ప్రారంభిస్తారు. కృత్రిమ మేధస్సు అనేది జీవితాన్ని సరళంగా మార్చడానికి ఉద్దేశించింది. అయితే మ్యానువల్ జ్యోక్యం ఎందుకో అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పరికరాల నుంచి మొత్తం డేటా ఎవరు సేకరిస్తున్నారు, అది ఎలా ఉపయోగిస్తున్నారు అనే భయాలు కూడా ఉన్నాయి. హ్యాకర్లు ఈ డేటా పొందే అవకాశముంది. మీ వ్యవస్థను హ్యాకర్లు సైబర్ దాడులు చేసతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి.

స్మార్ట్ రోబోట్లు, కనెక్టే చేసుకునే ఉపకరణాలు ఎక్కువగా ఉపయోగించబడుతోన్న తైవాన్ వంటి ప్రదేశాల్లో పరికరాల్లోకి హ్యాక్ చేయడానికి వ్యవస్థల్లోని లొసుగులను హ్యాకర్లు దుర్వినియోగం చేసే ప్రమాదాలు సాధారణంగా జరుగుతుంటాయి. ఇటీవల జరిగిన కంజూమర్ ఎలక్ట్రానిక్స్ కాన్ఫరెన్స్ లో ఐయోటీ ఇంజినీర్లు హోం రోబోట్లపై హ్యాకర్లు నియంత్రణ సాధించిన అనేక సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఇది పనిచేయకపోవడం, గృహ ఉత్పత్తులను కూడా దెబ్బతీస్తుంది. ఈ నియంత్రణను విడుదల చేయడానికి హ్యాకర్లు బిట్ కాయిన్స్ లేదా నగదు చెల్లింపులను డిమాండ్ చేయడం ప్రారంభించారు.

ఇలాంటి హ్యాకింగ్స్ నివారించడానికి టెక్నాలజీ ఎన్క్రిప్షన్, డేటా భద్రతా ప్రక్రియలు ఎలా అమలు చేయబడుతున్నాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వచ్చేవరకు, ఇంటిని పూర్తిగా స్మార్ట్ గా మార్చడం ప్రమాదమే. వీటి గురించి తెలియని వినియోగదారులు తమ ఇళ్లను ఉపకరణాల సాయంతో స్మార్ట్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారు. వాస్తవానికి అలా చేయకుండా నిరాకరించాలి. అవును.. కొన్ని ఆవిష్కరణలు సహాయపడతాయి. వాతావరణం ఆధారంగా ఏసీ ఉష్ణోగ్రతను మార్చే మొబైల్ సెన్సార్లు ఉపయోగించి లైట్లు లేదా ఫ్యాన్ ను ఆన్ చేయడం లేదా రిఫ్రిజిరేటర్లలోని కెమేరాలు కూడా ఏ ఉత్పత్తులను నిల్వ చేస్తున్నాయో చూపించే సదుపాయలు వీటిలో ఉన్నాయి. అయితే వీటికి మించి తెలియని నష్టాలు కూడా ఉన్నాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Technology

ఉత్తమ కథలు