6 Planets: నేడు ఆకాశంలో అద్భుతం... తమ అసలు స్థానాల్లో ఆరు గ్రహాలు

6 Planets in Original Place: ఇలా ఎప్పుడూ జరగలేదు. ఆరు గ్రహాలు తమ అసలు స్థానాల్లోకి రావడం ఓ అద్భుత ఘట్టం అని జ్యోతిషులు చెబుతున్నారు. ఇవాళ ఏం చేసినా శుభమే అంటున్నారు.

news18-telugu
Updated: September 13, 2020, 7:28 AM IST
6 Planets: నేడు ఆకాశంలో అద్భుతం... తమ అసలు స్థానాల్లో ఆరు గ్రహాలు
నేడు ఆకాశంలో అద్భుతం... తమ అసలు స్థానాల్లో ఆరు గ్రహాలు (credit - NASA)
  • Share this:
6 Planets in Original Place: మన సౌరకుటుంబంలో ఇవాళ జరగబోయేది ఓ అంతరిక్ష అద్భుతమే అనుకోవచ్చు. ఎందుకంటే... ఇవాళ... ఉదయం 10.30 గంటలకు సౌరకుటుంబంలోని నవ గ్రహాల్లో (ప్లూటో మరుగుజ్జు గ్రహం)... ఆరు ప్రధాన గ్రహాలు... వాటి వాటి ఉచ్ఛ స్థానాల్లో ఉంటాయి. అంటే రాశి చక్రంలో ఏ గ్రహం ఎక్కడ ఉండాలో... అక్కడ ఆ గ్రహం ఉంటుంది. ఇలా ఆరు ప్రధాన గ్రహాలు ఉండటం అనేది... గతంలో ఎప్పుడూ జరగలేదు. సమీప భవిష్యత్తులో మళ్లీ అలా జరిగే అవకాశం కూడా కనిపించట్లేదు. అంటే ఇవాళ ఎంత అరుదైన రోజో మనం గ్రహించవచ్చు. జ్యోతిష్యం ప్రకారం... నవగ్రహాల్లో రాహు, కేతు, శుక్రగ్రహాలు తప్ప మిగిలిన ఆరు గ్రహాలు వాటి వాటి స్థానాల్లో ఉండబోతున్నాయి.

ఇలా ఆరు గ్రహాలు ఉండాల్సిన చోట ఉండటం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ 250 ఏళ్ల వరకూ జరగదని చెప్పారు. అందువల్ల ఎవరైనా సరే ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే... ఇవాళ చేసుకోమని సూచిస్తున్నారు.

గ్రహాలు తమ తమ అసలు స్థానాల్లో ఉండటం అంటే ఏంటి?
జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికీ ఓ ప్లేస్ ఉంటుంది. దాన్నే ఇల్లు అంటారు. అలాగే... ప్రతీ గ్రహానికీ ఉచ్ఛ స్థితి, అధమ స్థితి ఉంటుంది. ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రహం వల్ల అందరికీ మేలు జరుగుతుంది. అదే అధమ స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రహం వల్ల అందరికీ నష్టం జరుగుతుందని పండితులు అంటున్నారు. అలా ఇవాళ ఆరు గ్రహాలు... తమ తమ ఇళ్లలో ఉంటూ... ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నాయి. అంటే రెండు అరుదైన పరిణామాలు ఒకే రోజు జరగబోతున్నాయి. శ్రీరాముడు పుట్టినప్పుడు అన్ని గ్రహాలు ఉఛ్ఛ స్ధానాల్లో ఉన్నాయనీ... అలా ఇప్పుడు జరుగుతోందని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 13, 2020, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading