వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

నవంబర్ 12 నుంచి యూజర్లు బ్యాకప్ చేసుకున్న వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌లో కనిపించదు. మీ ఫోన్ నెంబర్స్, సెట్టింగ్స్, మెసేజెస్ గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లినట్టు... వాట్సప్ ఆటోమెటిక్ బ్యాకప్స్ కూడా గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి.

news18-telugu
Updated: October 22, 2018, 1:23 PM IST
వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నవంబర్‌లో వాట్సప్‌లో అతిపెద్ద అప్‌డేట్ కోట్లాదిమంది యూజర్లను ప్రభావితం చేయనుంది. ఇన్నాళ్లూ ఉన్న వాట్సప్ ఛాట్ బ్యాకప్ విధానం కాస్త మారనుంది. గతంలో వాట్సప్ బ్యాకప్ మొత్తం గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యేది. గూగుల్ మీకు కేటాయించిన స్పేస్‌లోనే వాట్సప్‌ డేటా వాటా కనిపించేది. ఇకపై వాట్సప్ డేటా బ్యాకప్‌ కోసం గూగుల్ డ్రైవ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణం గూగుల్‌తో వాట్సప్ చేసుకున్న ఒప్పందమే.

నవంబర్ 12 నుంచి యూజర్లు బ్యాకప్ చేసుకున్న వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌లో కనిపించదు. మీ ఫోన్ నెంబర్స్, సెట్టింగ్స్, మెసేజెస్ గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లినట్టు... వాట్సప్ ఆటోమెటిక్ బ్యాకప్స్ కూడా గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి. మీరు ఫోన్ మార్చినప్పుడు లేదా వాట్సప్ డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు గూగుల్ నుంచి వాట్సప్ బ్యాకప్‌ ద్వారా మొత్తం మెసేజెస్ రీస్టోర్ అవుతాయి.

ఒక్కసారి నవంబర్‌లో అప్‌డేట్ రిలీజ్ అయిందంటే ఏడాది కంటే ఎక్కువగా అప్‌డేట్ చేయని వాట్సప్ బ్యాకప్స్‌(ఫోటోలు, వీడియోలు, ఛాట్స్) గూగుల్ స్టోరేజీ నుంచి డిలిట్ అయిపోతాయి. అంటే... వాట్సప్ యూజర్లు ఏడాదిగా డ్రైవ్‌లోకి బ్యాకప్ చేయలేదంటే ఆ డేటా కోల్పోవడం ఖాయం. అందులో ముఖ్యమైన ఛాట్స్‌తో పాటు మీడియా ఫైల్స్ కూడా ఉండొచ్చు. గూగుల్ డ్రైవ్‌లో చాలాకాలంగా డేటా ఉంటే 2018 నవంబర్ 12 లోగా "మ్యాన్యువల్లీ బ్యాకప్" చేసుకోవాలని వాట్సప్ సూచిస్తోంది.

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!, To not lose your WhatsApp data forever, do these things before 12 November
ప్రతీకాత్మక చిత్రం


డేటా బ్యాకప్ ఎలా చేయాలో తెలుసుకోండి:
1. ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ డ్రైవ్ ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ చేయాలి.
2. వాట్సప్‌లో త్రీ డాట్ ఐకాన్ క్లిక్‌ చేసి 'సెట్టింగ్స్' ఓపెన్ చేయండి.3. అందులో 'ఛాట్స్' సెలెక్ట్ చేసుకోండి.
4. 'ఛాట్ బ్యాకప్' క్లిక్ చేయండి.
5. అందులో చివరిసారిగా బ్యాకప్ చేసిన వివరాలుంటాయి.
6. బ్యాకప్ చేసి చాలారోజలై ఉంటే గూగుల్ డ్రైవ్ స్టోరేజీలోకి మళ్లీ 'బ్యాకప్' చేసుకోండి.
7. అందులోనే 'గూగుల్ డ్రైవ్ సెట్టింగ్స్' మార్చుకోవాలి.
8. 'బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్'లో ఆటోమెటిక్ టైమ్ పీరియడ్ సెట్ చేసుకోవాలి.
9. చాట్, మీడియా, వీడియోలు ఇలా మీకు అవసరమైనవి బ్యాకప్ చేసుకోవచ్చు.

నోట్: వాట్సప్ బ్యాకప్ చేసేప్పుడు వైఫై కనెక్షన్ ఉపయోగించడం మంచిది. మొబైల్ డేటా ఉపయోగిస్తే చాలా ఖర్చయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

నవంబర్ 20 లోపే రెడ్‌మీ నోట్ 6 ప్రో లాంఛింగ్!

షావోమీ దివాళీ సేల్‌లో ఆఫర్లివే!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఫెస్టివల్ సేల్!

Photos: 50 ఫోన్లకు ఆండ్రాయిడ్ 9 పై అప్‌డేట్: మరి మీ ఫోన్ ఉందా?

నో-కాస్ట్ ఈఎంఐలో అసలు మతలబేంటీ?

వాట్సప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు!

వాటర్ డ్రాప్ నాచ్‌తో వివో జెడ్‌3

క్రెడిట్ స్కోర్‌ని దెబ్బతీసే మీ సోషల్ మీడియా పోస్టులు!

ఇంటికి ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

 
First published: October 22, 2018, 11:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading