టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంతో అంతే వేగంగా సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అమాయకులను మోసం చేసి అక్రమంగా డబ్బులను సంపాదిస్తున్నారు. అయితే సైబర్ దొంగతనాలు అనేవి ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లోకి చొరబడి మనకు తెలియకుండానే మన ఖాతా ఖాళీ అయిపోతుంది. అయితే ఆ కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి యాప్ లల్లోకి కూడా చొరబడ్డారు. నకిలీ యాప్స్ ను క్రియోట్ చేసి వాటి నుంచి డేటా లాగుతున్నారు. ఇలా హ్యాకర్లు దేనిని వదలకుండా ధనార్జనే ధ్యేయంగా అమాయకులను బుట్టులో వేసుకుంటున్నారు. ఏది నిజమైన యాప్స్, ఏవి కావో తెసుకోలేని పరిస్థతి నెలకొంది. వీటితో పాటు కొత్తగా స్పామ్ యాప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ప్లేస్టోర్ కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఈ గైడ్‌లైన్స్ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ చెప్పింది.
ఇక నుంచి యాప్ టైటిల్ ను ఎక్కువ క్యారెక్టర్లకు కాకుండా 30 క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం చేయనుంది. ఒక యాప్ కు సంబంధించి ముఖ్యంగా దాని ఐకాన్. దాని విషయంలో డెవలపర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దీనిలో డెవలపర్ ప్రమోషన్ పేరును తొలగించనుంది. అంతే కాకుండా యాప్స్ క్రియేట్ చేసింది ఒకదాని కోసం అయితే ఐకాన్ పై ఇచ్చే గ్రాఫిక్స్ మాత్రం వినియోగదారులను తప్పుపట్టించే విధంగా ఇస్తుంటారు. ఇక వీటికి చెల్లు చీటి కానుంది. వీటిని నిషేధిస్తూ కొత్త గైడ్ లైన్స్ పెట్టనుంది. అంతేకాకుండా క్యాపిటల్ ఫాంట్స్ వాడకాన్ని, యాప్ పేరులో చాలా మంది ఎమోజీలు వాడుతారు.. ఇక నుంచి వాటిని వాడకూడదని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఈ గైడ్‌లైన్స్ పాటించని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించబోమని కంపెనీ చెప్పింది.
లిస్టింగ్ ప్రివ్యూవ్‌కి సంబంధించి కూడా కొత్త ఎసెట్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది గూగుల్. ఆ యాప్‌ను యూజర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా? లేదా? అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని యాప్ డెవలపర్స్‌కు సూచించింది. కొన్ని యాప్స్ లో ప్రివ్యూస్ ఎసెట్స్ జనాలకు అర్థం కాకుండా ఉండేవి. ఇక నుంచి అలా కుదరదని.. అందరికీ అర్థమయ్యే రీతిలో అవి ఉండాలని చెప్పింది. ఈ గైడ్ లైన్స్ 2021 జూన్, జూలై మధ్య కాలంలో అమలులోకి వస్తాయని.. ఏ రోజు నుంచి అనేది త్వరలో ప్రకటిస్తామని గూగుల్ తెలిపింది. ఇవి అమలులోకి వస్తే ఫేక్ యాప్స్ కి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FAKE APPS, Google Play store, Graphics on the icon, Latest Technology, New Guidelines, To ban designs and tools, To find out