news18-telugu
Updated: November 20, 2020, 6:18 PM IST
Timex iConnect: స్మార్ట్ వాచ్ లాంఛ్ చేసిన టైమెక్స్
ప్రీమియం యాక్టివ్ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లో Timex చవకైన Smartwatch లాంఛ్ చేసింది. వీటి ధరలు రూ.6,995 నుంచి రూ.7,295 మధ్య ఉన్నాయి. టైమెక్స్ రీటైల్, ఆన్ లైన్ వెబ్ సైట్లలో ఈ వాచ్ లు లభిస్తున్నాయి. iConnect మోనికర్ పేరుతో ఇండియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ లు చాలా బాగున్నాయి. ప్రీమియం సెగ్మెంట్ లో 2 వాచ్ లు లాంచ్ అయ్యాయి. చూసేందుకు ఫ్యాషన్ గా ఉంటూనే సరికొత్త ఫిట్నెస్ ఫీచర్లను సపోర్ట్ చేసేలా ఈ వాచ్ ఉండడం హైలైట్. ఓ రకంగా దీన్ని హై ఎండ్ ఫిట్నెస్ బ్యాండ్ గా కూడా భావించవచ్చు. మెటల్ స్ట్రాప్స్ ఉన్న ఈ వాచులతో మీలోని ఫ్యాషన్ ఉబలాటాన్ని సంతృప్తిపరచవచ్చు. హైబ్రిడ్ వాచుల్లా కనిపించే ఈ స్మార్ట్ వాచులు సరసమైన ధరల్లో ఉండడం విశేషమే. సిలికిన్ స్ట్రాప్స్, మెటల్ స్ట్రాప్స్ రెండు వేరియంట్లున్న టైమెక్స్ వాచుల్లో బడ్జెట్ వాచులు మాత్రం సిలికాన్ స్ట్రిప్ తో ఉంటాయి.
Cylinder Booking on Paytm: పేటీఎంలో సింపుల్‌గా సిలిండర్ బుకింగ్... ఎలా చేయాలంటేEarphones: ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే ఎంత డేంజరో తెలుసా?
4 వేరియంట్స్
iConnect Premium Active Smartwatch లను మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన టైమెక్స్ వీటిలో రెండు వేరియంట్లను మెటల్ స్ట్రాప్స్ తో డిజైన్ చేసింది. మిగతా 2 మాత్రం సాఫ్ట్ సిలికాన్ స్ట్రాప్స్ తో ఉన్నాయి. మనదేశంలో క్రేజీ-ట్రెండీ ఫ్యాషన్, ఫిట్నెస్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని iConnect మోడల్స్ ను లాంచ్ చేస్తున్నట్టు టైమెక్స్ గ్రూప్, ఈ కామర్స్, మార్కెటింగ్ హెడ్ గా ఉన్న అజయ్ ధ్యాని వెల్లడించారు.
కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్
కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్ కు టైమెక్స్ పెట్టింది పేరు. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సరసమైన ధరలకే టైమెక్స్ వస్తువులను మార్కెట్లో లాంచ్ చేసి, అంతర్జాతీయ ఆదరణ పొందుతున్న టైమెక్స్ సరికొత్త స్మార్ట్ వాచులకు అప్పుడే మంచి బజ్ వస్తోంది. ఎక్కువ ఫీచర్లను సపోర్ట్ చేసే ఈ వాచ్ లను అన్ని వర్గాలు, వయసుల కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ మెష్ బ్యాండ్స్ తో స్టైల్ కోషంట్ పెంచేలా ఉన్న వాచ్ లను లాంచ్ చేసిన టైమెక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్ గా తమ డిజైన్స్ ను అప్ డేట్ చేస్తోంది. ఇక తాజాగా లాంచ్ అయిన స్మార్ట్ వాచులను కేవలం ఫిట్నెస్ కోసమే కాకుండా పార్టీలకు లేదా ఇతర అకేషన్స్ కు ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేలా స్టైలిష్ గా డిజైన్ చేశారు.
WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
5 రోజుల బ్యాటరీ బ్యాకప్
కాంపిటీటర్ల కంటే తక్కువ ధరకే స్మార్ట్ వాచులను అందుబాటులోకి తెస్తూ స్మార్ట్ వాచ్ మార్కెట్లో గేమ్ ఛేంజర్ గా నిలిచేందుకు టైమెక్స్ ఎత్తులు వేస్తోంది. టైమెక్స్ స్మార్ట్ వాచ్ కేస్ సైజ్ 36mm ఉండగా, కాల్స్, మెసేజ్ వస్తే డైరెక్ట్ నోటిఫికేషన్స్ వచ్చేలా ఫీచర్లున్నాయి. వీటితో పాటు కాలెండర్, ఈవెంట్స్, హార్ట్ రేట్ సెన్సర్, సెడెంటరీ రిమైండర్, యాక్టివిటీ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, మ్యూజిక్ ట్రాకింగ్, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో టైమెక్స్ ఆకట్టుకుంటోంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో కూడా టైమెక్స్ స్మార్ట్ వాచ్ అద్భుతమనిపించేలా ఉంది. 5 రోజులపాటు ఈ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని టైమెక్స్ వెల్లడించింది.
Published by:
Santhosh Kumar S
First published:
November 20, 2020, 6:18 PM IST