news18
Updated: November 24, 2020, 10:10 PM IST
Timex smart watch
- News18
- Last Updated:
November 24, 2020, 10:10 PM IST
మొబైల్ ఇండస్ట్రీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గ విధంగా సపోర్టింగ్ డివైజె లను కూడా రూపొందిస్తున్నాయి ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు. అయితే దీనికి భిన్నంగా ప్రముఖ వాచ్ తయారీ సంస్థ టైమెక్స్.. వైర్లెస్ ఛార్జింగ్ సాయంతో వచ్చే సరికొత్త అలారం క్లాక్ ను త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులో తేనున్నట్లు తెలుస్తోంది. ఈ గడియారాన్ని వైర్లెస్ పవర్ కన్సార్టియం వెబ్సైట్ లో ప్రదర్శనకు ఉంచారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వైర్లెస్ వాచ్ కు సర్టిఫికేషన్ కూడా లభించింది. త్వరలోనే దీని ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు టైమెక్స్ తన వెబ్సైట్లో పేర్కొంది.
దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ వైర్లెస్ అలారం క్లాక్ మార్కెట్లోకి వస్తుందని చెప్పవచ్చు. ఈ అనుమతితో పాటు కన్సార్షియం ఒక ఫోటోను అటాచ్ చేసింది. విడుదలైన ఈ ఫోటోను బట్టి చూస్తే టైమెక్స్ నుంచి వస్తున్న ఈ వైర్లెస్ చార్జర్, చూడటానికి చాలా సింపుల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. దీని ఉపరితలంపై వైర్లెస్ ఛార్జింగ్‌ను అందించడానికి ఒక స్పిన్‌ను కూడా ఇచ్చింది. టైమెక్స్ అనేది పాత-కాలపు వాచ్ తయారీ బ్రాండ్ అనే విషయం తెలిసిందే. అయితే, ఇది నూతన సాంకేతికను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. నూతనంగా మార్కెట్లోకి రానున్న ఈ వైర్లెస్ అలారం గడియారంపై మీ ఫోన్‌ను పెడితే పెడితే చాలు మీరు దాన్ని ఛార్జ్ చేయగలుగుతారు.
త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి..
కాగా, సింపుల్ డిజైన్ తో ఆకట్టుకుంటున్న ఈ వైర్లెస్ అలారం వాచ్ మోడల్ నంబర్ టీడబ్ల్యూ300 అని టైమెక్స్ తెలిపింది. ఇది గనుక మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాచ్ ఫోటోను పరిశీలించగా స్థూపాకార టేబుల్-టాప్ డిజైన్‌తో రూపొందిన అలారం క్లాక్, ఎరుపు రంగు LED కాంతితో సమయాన్ని చూపించే డిస్ప్లే స్క్రీన్ ను కలిగి ఉంది. కాగా దీనిని టైమెక్స్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభించబడుతుంది, మార్కెట్లోకి ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాలపై కూడా స్పష్టతనివ్వలేదు టైమెక్స్ కంపెనీ. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, టైమెక్స్ ఇటీవల భారత మార్కెట్లోకి ఐ కనెక్ట్ ప్రీమియం యాక్టివ్ స్మార్ట్‌వాచ్‌ను కూడా విడుదల చేసింది. కలర్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వచ్చే ఈ వాచ్ సిలికాన్, స్టెయిన్లెస్ స్ట్రాప్ ఆప్షన్లను కలిగి ఉంది. అట్రాక్టివ్ ఫీచర్లతో వచ్చే ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ ధర భారతదేశంలో రూ .6,995 నుండి ప్రారంభమవుతుంది.
Published by:
Srinivas Munigala
First published:
November 24, 2020, 10:08 PM IST