కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2020 జ్ఞాపకాలను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాదు... లాక్డౌన్లో ఇళ్లల్లో ఉన్నవారు ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ యాప్స్ పైనే ఆధారపడ్డారు. మరి ఈ సంవత్సరం ఎక్కువగా ఉపయోగించిన మొబైల్ యాప్స్ ఏవో తెలుసుకోండి.
1. TikTok: చైనాకు చెందిన బైట్ డ్యాన్స్‌కు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఇండిాలో ఈ యాప్‌ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయకముందే ఈ యాప్ టాప్ లిస్ట్‌లో ఉంది.
2. YouTube: వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్ది రెండో స్థానం. రకరకాల టాలెంట్ ఉన్న కంటెంట్ క్రియేటర్లు వీడియోలతో తన టాలెంట్‌ను పంచుకుంటున్నారు. లాక్డౌన్ కాలంలో యూట్యూబ్ చూసినవారి సంఖ్య పెరిగింది.
3. Netflix: లాక్డౌన్ కాలంలో బాగా పాపులర్ అయిన వాటిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. అందులో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఇళ్లకే పరిమితం అయినవారు ఎంటర్టైన్మెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్ పైన ఆధారపడ్డారు.
WhatsApp Trick: వాట్సప్ స్టేటస్ సీక్రెట్‌గా చూడటం ఎలాగో తెలుసా?
Redmi 9 Power: ఈ మోడల్ ఫోన్లన్నీ 30 సెకన్లలో అమ్ముడుపోయాయి... ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
4. Instagram: ఫేస్‌బుక్‌కు చెందిన ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్స్టాగ్రామ్ టాప్. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్స్ కన్నా ఇన్స్టాగ్రామ్ ముందుంది. ఇటీవలే టిక్‌టాక్‌కు పోటీగా రీల్స్ లాంఛ్ చేసింది ఇన్స్టాగ్రామ్.
5. Zoom: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అందరూ ఐదారు నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇంటి నుంచే పనులు చేయాల్సి వచ్చింది. ఆఫీస్ వర్క్స్ అన్నీ ఇంటి నుంచే చేయకతప్పలేదు. వీడియో కాన్ఫరెన్స్, వీడియో మీటింగ్‌ల కోసం జూమ్ యాప్ ఎంతగానో ఉపయోగపడింది.
6. Google Meet: జూమ్ తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం గూగుల్ మీట్‌ను ఉపయోగించారు యూజర్లు. కరోనా మహమ్మారి కాలంలో గూగుల్ మీట్ కూడా పాపులర్ అయింది.
7. WhatsApp: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2020 లో కూడా 200 కోట్ల సార్లు వాట్సప్ యాప్‌ను డౌన్లోడ్ చేయడం విశేషం.
Smartphones under Rs 15000: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Paytm: పేటీఎంలో డబ్బులు పంపుతున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే
8. Facebook Messenger: ఇది కూడా మెసేజింగ్ యాప్. వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ఫేస్బుక్ మెసెంజర్ యాప్ ఉపయోగించే వారు ఉన్నారు. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ మెసెంజర్ పాపులర్ అయింది.
9. Facebook: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు, బంధువులను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి చేరడానికి ఫేస్బుక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది కూడా ఫేస్బుక్ టాప్ 10 లిస్ట్‌లో ఉంది.
10. Amazon: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ పేరు చెబితే గుర్తొచ్చే వాటిలో అమెజాన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ లవర్స్‌కు ఫేవరెట్ యాప్. కరోనా లాక్డౌన్ సమయంలో అమెజాన్ డౌన్లోడ్స్ కూడా పెరిగాయి.