TikTok Alert : టిక్ టాక్ వాడుతున్నారా... అర్జెంటుగా ఇలా చెయ్యండి...

TikTok Alert : ప్రజలు ఎక్కువగా ఏ యాప్ వాడుతున్నారో... దాన్ని అదే పనిగా టార్గెట్ చెయ్యడం హ్యాకర్లకు అలవాటు. ఇండియాలో దూసుకుపోతున్న టిక్ టాక్ ఇప్పుడు వాళ్ల టార్గెట్ అయ్యింది.

news18-telugu
Updated: January 10, 2020, 5:55 AM IST
TikTok Alert : టిక్ టాక్ వాడుతున్నారా... అర్జెంటుగా ఇలా చెయ్యండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
TikTok Alert : ఇండియాలో స్మార్ట్ మొబైల్ ఉన్న వారిలో 30 కోట్ల మందికి పైగా టిక్ టాక్ వాడుతున్నారు. అందులో వచ్చే 15 సెకండ్ల షార్ట్ వీడియో మెసేజ్‌లను చూస్తూ ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఐతే... కొందరికి టిక్ టాక్ ఎలా వాడాలో కూడా తెలియదు. వాళ్ల పిల్లలు తల్లిదండ్రుల మొబైళ్లలో టిక్ టాక్‌ను ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. ఆ విషయం తెలియని పేరెంట్స్... దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలాంటి లూప్‌హోల్స్‌ని గుర్తించిన హ్యాకర్లు... టిక్ టాక్‍‌ ద్వారా ఓ బగ్‌ని ఎంటర్ చేశారు. అది ఇప్పుడు చాలా మంది టిక్ టాక్ యాప్స్‌లో చేరి... అక్కడి నుంచీ మొబైళ్లలో తిష్టవేసి... వాళ్ల కాంటాక్ట్ నంబర్లు, లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఫొటోలూ, వీడియోలూ అన్నింటినీ హ్యాకర్లకు చేరవేస్తున్నాయి. ముఖ్యంగా ఈ బగ్ ద్వారా అమ్మాయిలు తీసుకునే సెల్ఫీలను హ్యాకర్లు కాజేస్తున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి... నగ్నంగా చూపిస్తూ... పోర్న్ వెబ్‌సైట్లకు ఆ ఫొటోలను అమ్ముకుంటున్నారు. ఇలా చాలా మంది పోర్న్ ప్రపంచంతో సంబంధం లేని అమ్మాయిల ఫొటోలు... ఆ సైట్లలో దర్శనమిస్తున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ పరిస్థితిని ఆల్రెడీ టిక్ టాక్ యాజమాన్యం బైట్ డాన్స్ నవంబర్‌లోనే గుర్తించింది. ఆ తర్వాత... డిసెంబర్‌లో ఆ వైరస్ బగ్ దాడి నుంచీ టిక్ టాక్‌ను కాపాడేలా యాప్ సెక్యూరిటీని పెంచింది. ఐతే... ఇప్పటికీ చాలా టిక్ టాక్ అకౌంట్లలో ఆ బగ్ అలాగే ఉంది. ఇందుకు కారణం... వాళ్లెవరూ... యాప్‌ని అప్ డేట్ చెయ్యకపోవడం, రీలాగిన్ అవ్వకపోవడమే. అందువల్ల టిక్ టాక్ యాజమాన్యం యాప్ వాడుతున్న ప్రతి ఒక్కర్నీ యాప్ అప్‌డేట్ చేసుకోమని కోరుతోంది. అలాగే... యాప్ నుంచీ ఓసారి లాగ్ అవుట్ అయ్యి... తిరిగి లాగ్ ఇన్ అవ్వాలని కోరుతోంది. ఇలా చేస్తే... ఇక ఆ బగ్ నుంచీ తప్పించుకున్నట్లే. ఇలా చెయ్యకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదం ఉందంటున్నారు సైబర్ నిపుణులు.
Published by: Krishna Kumar N
First published: January 10, 2020, 5:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading