Home /News /technology /

TikTok కి షాక్... దారుణంగా పడిపోయిన రేటింగ్...

TikTok కి షాక్... దారుణంగా పడిపోయిన రేటింగ్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TikTok Rating | టిక్ టాక్ యాప్ రేటింగ్ దారుణంగా పడిపోయింది.

    ప్రముఖ షార్ట్ వీడియో మొబైల్ యాప్ TikTok కి భారత్‌లో నెటిజన్లు షాక్ ఇస్తున్నారు. టిక్ టాక్ యాప్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో 1 స్టార్ రేటింగ్‌లో ఉంది. ఇప్పటికే భారత్‌లో ఓసారి బ్యాన్ అయ్యి, బయటపడిన టిక్ టాక్ మరోసారి బ్యాన్ ముంగిట నిలిచింది. కొన్ని రోజుల క్రితం వరకు 4.5 స్టార్ రేటింగ్‌తో ఉన్న టిక్ టాక్ ప్రస్తుతం 1.3 స్టార్ రేటింగ్‌తో కొనసాగుతోంది. చాలా మంది యూజర్లు ఇచ్చిన కామెంట్లను చెక్ చేస్తే... టిక్ టాక్ వైఖరిని తప్పుపడుతున్నారు. కొందరు సాంకేతిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఏవైనా సమస్యలు వస్తే టెక్నికల్ టీం స్పందించడం లేదని చెప్పారు. డౌన్ లోడ్ చేసిన వెంటనే ఓపెన్ కావడం లేదని ఇంకొందరు చెప్పారు. మరోవైపు భారత్‌లో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలంటూ ఫైజల్ సిద్ధికీ అనే ఓ యూజర్ జాతీయ మహిళా హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓ మహిళపై యాసిడ్ దాడి చేస్తున్నట్లుగా వీడియో ఉండటంపై NCW తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. 15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడిని ఎదుర్కొన్న లక్ష్మీ అగర్వాల్ కూడా ఆ వీడియోను తప్పుపట్టారు.

    మరోవైపు హింసాత్మక వీడియోపై టిక్ టాక్ స్పందించింది. ‘సురక్షితమై వాతావరణం పెంపొందించడం టిక్ టాక్ ప్రాధాన్యాల్లో ముఖ్యమైంది. టిక్ టాక్ ప్లాట్ ఫాం మీద ఏం అనుమతిస్తాం? వేటికి అనుమతి లేదనే విషయం నియమ నిబంధనలు, మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. దీన్ని మా యూజర్లు అన్ని సమయాల్లో పాటిస్తారని ఆకాంక్షిస్తున్నాం.’ అని వివరణ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా తమ పాలసీలకు వ్యతిరేకంగా టిక్ టాక్‌లో కొందరు యూజర్లు హింసాత్మక వీడియోలను పోస్టు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. అలాంటి కంటెంట్‌ను తాము నియంత్రించినట్టు పేర్కొంది. సంబంధిత యూజర్ల అకౌంట్లను సస్పెండ్ చేశామని, దీనిపై చట్ట సంస్థలతో చర్చిస్తున్నట్టు తెలిపింది.


    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు