TikTok: టిక్‌టాక్ డీల్ ఫైనల్ అయ్యిందా? ఆ కంపెనీ కొనబోతుందా?

టిక్‌టాక్(TikTok)

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ యత్నాలు విఫలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్ యూఎస్ యాజమాన్య హక్కులను సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

  • Share this:
    ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ యత్నాలు విఫలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్ యూఎస్ యాజమాన్య హక్కులను సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో ఒరాకిల్ ప్రతినిధులు చర్చలు జరిపినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం.. టిక్‌టాక్ యూఎస్ యాజమాన్య హక్కులు కొనుగోలు చేయడంతో పాటుగా, బైట్‌డాన్స్‌కు ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ భాగస్వామిగా నిలవనున్నట్టుగా సమాచారం.

    తొలుత వాల్‌మార్ట్‌తో కలిసి మెక్రోసాఫ్ట్ యూఎస్‌లో టిక్‌టాక్ యాజమాన్య హక్కులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ త‌మ ఆఫ‌ర్‌ను టిక్‌టాక్ తిర‌స్క‌రించిన‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధ గడువు పొడిగించేది లేదని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేయడంతో.. ఈ కొద్ది వ్యవధిలో బైట్‌డాన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
    Published by:Sumanth Kanukula
    First published: