TikTok Phone: త్వరలో టిక్‌టాక్ ఫోన్... రిలీజ్ చేయనున్న బైట్‌డ్యాన్స్

TikTok Phone | బైట్‌డ్యాన్స్ రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్‌లో ఆ కంపెనీకి చెందిన యాప్స్ అన్నీ ప్రీలోడెడ్‌గా వస్తాయి.

news18-telugu
Updated: May 28, 2019, 12:27 PM IST
TikTok Phone: త్వరలో టిక్‌టాక్ ఫోన్... రిలీజ్ చేయనున్న బైట్‌డ్యాన్స్
TikTok Phone: త్వరలో టిక్‌టాక్ ఫోన్... రిలీజ్ చేయనున్న బైట్‌డ్యాన్స్
  • Share this:
బైట్‌డ్యాన్స్... చైనాకు చెందిన కంపెనీ. టిక్‌టాక్ యాప్‌తో ఫేమస్ అయింది. త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే షావోమీ, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్‌మీ కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఇప్పుడు ఈ రేస్‌లోకి దూసుకొస్తోంది బైట్‌డ్యాన్స్. తక్కువ ధరకే మిడ్‌ రేంజ్ సెగ్మెంట్ ఫోన్లు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. బైట్‌డ్యాన్స్ రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్‌లో ఆ కంపెనీకి చెందిన యాప్స్ అన్నీ ప్రీలోడెడ్‌గా వస్తాయి. అంతేకాదు త్వరలో బైట్‌డ్యాన్స్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ కూడా లాంఛ్ చేసే ఆలోచనలో ఉంది. దీంతో స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ లాంటి కంపెనీలకు కూడా పోటీ ఇవ్వనుంది.

బైట్‌డ్యాన్స్ రిలీజ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉంటాయి? వాటి స్పెసిఫికేషన్స్ ఏంటీ? ధర ఎంత? అన్న వివరాలేవీ ప్రస్తుతానికి తెలియవు. అయితే స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లోకి బైట్‌డ్యాన్స్ అడుగుపెట్టడం ఖాయంగా తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన టిక్‌టాక్ యాప్ యూజర్లు ఇండియాలో కోట్లల్లో ఉన్నారు. కాబట్టి బ్రాండ్ ప్రమోషన్‌కు ఢోకా లేదు. ఇండియాలో మార్కెట్ పెంచుకుంటున్న షావోమీ, రియల్‌మీ కంపెనీలకు ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

OMG: తల్లీకొడుకులు టెన్త్ ఒకేసారి పాసయ్యారు

Warren Buffett: ఆయనతో లంచ్ చేయాలంటే రూ.23 కోట్లు చెల్లించాలిRedmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ
Published by: Santhosh Kumar S
First published: May 28, 2019, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading