TikTok Safety: టిక్ టాక్ యాప్ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చారా?

TikTok New Safety Feature | టిక్ టాక్ యాప్ ఇండియాలో ఎంత క్రేజ్ సంపాదించుకుందో ఆ స్థాయిలోనే విమర్శల్నీ ఎదుర్కొంటోంది. ఇండియాలో టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లూ ఉన్నాయి.

news18-telugu
Updated: March 13, 2019, 5:28 PM IST
TikTok Safety: టిక్ టాక్ యాప్ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చారా?
TikTok Safety: టిక్ టాక్ యాప్ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మార్చారా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 13, 2019, 5:28 PM IST
TikTok... యువత మనసు దోచేసిన వీడియో షేరింగ్ యాప్ ఇది. కుర్రాళ్లలో టిక్ టాక్ యాప్ గురించి తెలియని వాళ్లుండరు. టిక్‌టాక్ యూజర్ల కోసం ఇటీవల ఓ సరికొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. "Filter Comments" ఫీచర్ ఇది. ఇందులో మీరు హిందీ, ఇంగ్లీష్‌లో కొన్ని పదాలను ఎంటర్ చేస్తే అలాంటి పదాలు ఉన్న కామెంట్స్ ఫిల్టర్ అవుతాయి. యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పదాలను మార్చుకోవచ్చు. #SafeHumSafeInternet, #BetterMeBetterInternet ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న టిక్ టాక్ ఇండియా ఈ సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదొక్కటే కాదు... యాప్‌లో మరిన్ని సేఫ్టీ ఫీచర్లున్నాయి. తమ వీడియోలకు ఎవరు కామెంట్ చేయాలి, ఎవరు రియాక్ట్ కావాలి, ఎవరు డౌన్‌లోడ్ చేసుకోవాలి అని సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

Read this: Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త

టిక్ టాక్ యాప్ ఇండియాలో ఎంత క్రేజ్ సంపాదించుకుందో ఆ స్థాయిలోనే విమర్శల్నీ ఎదుర్కొంటోంది. ఇండియాలో టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లూ ఉన్నాయి. టిక్‌ టాక్ యాప్‌పై తమిళనాడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. టిక్‌ టాక్ యాప్‌ను నిషేధించాలని ఎమ్మెల్యేలు సైతం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా చైనా యాప్ టిక్ టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేసింది. టిక్ టాక్ యాప్‌కు ఇండియాలో నెలకు 5.4 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉండటం విశేషం.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ
Loading...
Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు
First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...