టిక్‌టాక్... యూత్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని వీడియో క్రియేటింగ్, షేరింగ్ యాప్. యువతీయువకుల్లో టిక్‌టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టిక్‌టాక్ యాప్‌లో క్రియేటీవ్‌గా వీడియోలు రూపొందించడం, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడం, లైకులు, షేర్లు, కామెంట్లు సంపాదించడం మామూలే. టిక్‌టాక్ వీడియోలతో సెలబ్రిటీలుగా మారినవాళ్లున్నారు. సంచలనాలు సృష్టిస్తున్నవాళ్లున్నారు. టిక్‌టాక్ వీడియోలకు ఉన్న ఆదరణ అలాంటిది. అందుకే టిక్‌టాక్ యాప్ సంచలనాలు కొనసాగుతున్నాయి. వీడియో క్రియేటింగ్ యాప్స్‌లోనే కాదు... మొత్తం సోషల్ మీడియా యాప్స్‌లో టిక్టాక్దే హవా. వివిధ సంస్థల నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తున్నా, వివాదాలు చుట్టుముడుతున్నా టిక్‌టాక్ యాప్‌కు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కొన్ని సంస్థలు విడుదల చేస్తున్న లెక్కలు కూడా అవే చెబుతున్నాయి.
గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్స్‌లో సోషల్ మీడియా యాప్స్‌ని వెనక్కి నెట్టేస్తోంది టిక్‌టాక్. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, హెలో, ట్విట్టర్, చివరకు ఫేస్‌బుక్‌ను కూడా టిక్‌టాక్ దాటేసిందని సెన్సార్ టవర్ రిపోర్ట్ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2019 సెప్టెంబర్‌లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన సోషల్ మీడియా యాప్‌గా టిక్‌టాక్ రికార్డ్ సాధించింది. ఒక్క నెలలోనే టిక్‌టాక్ డౌన్లోడ్స్ 6 కోట్లు ఉండటం విశేషం. ఇందులో భారతదేశంలోనే 44 శాతం డౌన్లోడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఫేస్బుక్ నిలిచింది. ఇండియాలో ఫేస్బుక్ డౌన్లోడ్స్ 23 శాతం. గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్లోడ్స్ విషయంలో టిక్‌టాక్, ఫేస్‌బుక్‌తో పాటు ఇన్స్టాగ్రామ్, లైకీ, స్నాప్‌చాట్ టాప్ 5 యాప్స్‌లో ఉన్నాయి.
Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Mi Note 10: షావోమీ మరో సంచలనం... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్
WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు... ఇవే లాభాలు
WhatsApp: మీ వాట్సప్‌ని అద్భుతంగా మార్చే 5 ఫీచర్లు ఇవేPublished by:Santhosh Kumar S
First published:October 30, 2019, 10:57 am IST