హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Top Apps: ఈ ఏడాది డౌన్‌లోడ్స్‌లో టాప్ యాప్స్ ఇవే... మీ దగ్గర ఉన్నాయా?

Top Apps: ఈ ఏడాది డౌన్‌లోడ్స్‌లో టాప్ యాప్స్ ఇవే... మీ దగ్గర ఉన్నాయా?

TikTok App: ఈ ఏడాది డౌన్‌లోడ్స్‌లో టాప్ యాప్స్ ఇవే... మీ దగ్గర ఉన్నాయా?
(ప్రతీకాత్మక చిత్రం)

TikTok App: ఈ ఏడాది డౌన్‌లోడ్స్‌లో టాప్ యాప్స్ ఇవే... మీ దగ్గర ఉన్నాయా? (ప్రతీకాత్మక చిత్రం)

Top Apps in 2020 | ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డౌన్‌లోడ్స్ చేసిన యాప్స్ జాబితా రిలీజ్ చేసింది ఓ సంస్థ. అందులో మీ దగ్గర ఎన్ని యాప్స్ ఉన్నాయో తెలుసుకోండి.

  చైనీస్ వీడియో షేరింగ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్‌ యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచి రికార్డు సృష్టించింది. అనలిటికల్ సంస్థ App Annie తాజాగా సర్వే రిపోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటివరకు అత్యధిక డౌన్‌లోడ్స్ కలిగిన ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి టిక్‌టాక్ యాప్ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాక 2021లో ప్రపంచవ్యాప్తంగా సగటున 1.2 బిలియన్ల నెలవారీ యాక్టీవ్‌ యూజర్స్‌ను టిక్‌టాక్ కలిగి ఉంటుందని నివేదిక అంచనా వేసింది. యాప్ అన్నీ రూపిందించిన ఈ జాబితాలో ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మూడో స్థానాన్ని దక్కించుకోగా, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ నాలుగో స్థానంలో, వాట్సాప్ ఐదో స్థానాల్లో నిలిచాయి. కాగా, 2019లో అత్యధిక డౌన్‌లోడ్స్ కలిగి ఉన్న యాప్‌గా రికార్డుకెక్కిన ఫేస్‌బుక్‌కు చెందిన ‘మెసెంజర్ యాప్’ ఈ ఏడాదిలో ఆరో స్థానానికి పడిపోయిందని నివేదిక హైలైట్ చేసింది.

  Amazon Small Business Day 2020: రేపే అమెజాన్‌లో స్మాల్ బిజినెస్ డే... ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్స్

  Data Leak: భారతీయులకు బిగ్ షాక్... 70 లక్షల క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా లీక్

  యాప్ డౌన్‌లోడ్స్‌లో ఏటా 10 శాతం మేర వృద్ధి నమోదు


  ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లు ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 బిలియన్ల డౌన్లోడ్లను సాధిస్తాయి. అందువల్ల, యాప్ డౌన్లోడ్లు ఏటా 10 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని యాప్ అన్నీ నివేదిక పేర్కొంది. కోవిడ్–19 (COVID-19) కారణంగా ఈ ఏడాది అందరూ ఇంట్లోకే పరిమితమయ్యారు. తద్వారా మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగి యాప్ డౌన్‌లోడ్స్‌ పెరుగుదల వేగవంతమైందని నివేదిక అభిప్రాయపడింది. తద్వారా, మొబైల్ యాప్లపై వినియోగదారుల వ్యయం 2020లో 112 బిలియన్ డాలర్లను తాకిందని, అందువల్ల వార్షిక వృద్ధి 25 శాతం నమోదు చేసిందని నివేదిక హైలైట్ చేసింది.

  5G Smartphones: Jio 5G వచ్చేస్తోంది... మార్కెట్లో రెడీగా ఉన్న 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  WhatsApp Feature: మీ వాట్సప్ మెసేజెస్‌తో నిండిపోయిందా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి

  ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఉపయోగించే గూగుల్ ప్లే స్టోర్ డౌన్లోడ్లు, ఐఓఎస్ యూజర్లు ఉపయోగించే ఆపిల్ స్టోర్ డౌన్లోడ్ల కంటే 160 శాతం మేర పెరిగిట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే, 2020 ఏడాదిలో రెండు యాప్ స్టోర్ల ద్వారా 10 శాతం మేర డౌన్‌లోడ్‌లు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఐఓఎస్ మార్కెట్ ఎక్కువగా యుఎస్, జపాన్, సౌదీ అరేబియా దేశాల్లో ఉంటుంది. కాగా, భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. 2020లో అత్యధిక డౌన్లోడ్లు సాధించిన యాప్లలో టిండెర్, టిక్‌టాక్, యూట్యూబ్, డిస్నీ +, టెన్సెంట్ వీడియో యాప్స్ ఉన్నాయి. కాగా, ఈ ఏడాది టిక్‌టాక్ 15 స్థానాలు ఎగబాకి మొదటి స్థానానికి చేరుకోగా, గతంలో రెండో స్థానంలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఆరో స్థానానికి పడిపోయింది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Facebook, Instagram, Tiktok, Whatsapp, Year Ender 2020

  ఉత్తమ కథలు