కేంద్ర ప్రభుత్వ నిషేధంపై స్పందించిన టిక్‌టాక్ ఇండియా విభాగం... ఏమందంటే...

కేంద్ర ప్రభుత్వ నిషేధంపై స్పందించిన టిక్‌టాక్ ఇండియా విభాగం

Tiktok Ban : 58 చైనా యాప్స్‌తో కలిపి... టిక్‌టాక్ యాప్‌ని కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో... టిక్‌టాక్ ఇండియా విభాగం దీనిపై స్పందించింది.

  • Share this:
    Tiktok Ban : కేంద్రం ప్రభుత్వం ఇతర చైనా యాప్స్‌తో పాటూ... తమను కూడా నిషేధించిన అంశాన్ని పరిశీలిస్తున్నామని టిక్‌టాక్ ఇండియా విభాగం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తాము వివరణ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న టిక్ టాక్ ఇండియా విభాగం... తాము స్పందించేందుకూ, తమ వివరణ చెప్పుకునేందుకూ కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని కోరింది. భారత దేశ చట్టాల ప్రకారమే టిక్ టాక్... డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇండియాలోని యూజర్ల వివరాల్ని ప్రపంచంలోని మరో విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోవట్లేదనీ... చైనా ప్రభుత్వానికి కూడా ఇవ్వలేదని టిక్ టాక్ ఇండియా అంటోంది. భవిష్యత్తులూ కూడా అలా చెయ్యవద్దని కోరితే... ఎట్టి పరిస్థితుల్లో అలా చెయ్యబోమని తెలిపింది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి తాము అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది టిక్ టాక్ ఇండియా.

    నిషేధంపై టిక్ టాక్ స్పందన


    టిక్‌టాక్‌ని భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు తాము దాన్ని 14 భారతీయుల భాషల్లోకి మార్చామనీ... ఏకంగా కోట్ల మంది యూజర్లకు, ఆర్టిస్టులకు, స్టోరీ-టెల్లర్స్‌కీ, విద్యావంతులకూ చేరువ చేశామని వివరించింది. చాలా మంది టిక్‌టాక్‌పై ఆధారపడి జీవిస్తున్నారనీ... టిక్‌టాక్‌ని నిషేధిస్తే... వారి జీవనోపాధికి సమస్య ఏర్పడుతుందని తెలిపింది. యూజర్లలో చాలా మంది మొదటిసారి ఇంటర్నెట్ వాడుతున్నవారు ఉన్నారనీ... టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ తెలిపారు.
    First published: