గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్, హలో తొలగింపు

ప్రతీకాత్మక చిత్రం

భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం టిక్‌టాక్, హలో సహా 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో... గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ వీటిని తొలగించాయి.

  • Share this:
    భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం టిక్‌టాక్, హలో సహా 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో... గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ వీటిని తొలగించాయి. నిన్న ఈ యాప్‌లపై బ్యాన్ విధించిన కేంద్రం... వీటిని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించాలని యాపిల్, గూగుల్‌కు సమాచారం అందించింది. వీటితో పాటు పలు టెలికాం కంపెనీలకు సైతం తమ ఆదేశాలు పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు సంబంధించిన తమ ప్లే స్టోర్స్‌లో టిక్‌టాక్‌ను తొలగించాయి యాపిల్, గూగుల్. దీంతో ఇకపై వినియోగదారులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యంకాదు. టిక్‌టాక్‌తో పాటు హలో యాప్‌ను సైతం గూగుల్, యాపిల్ కంపెనీలు తమ స్టోర్స్‌ నుంచి తొలగించాయి.

    అంతకుముందు చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సోమవారం అనూహ్యమైన చర్య తీసుకుంది. సుమారు 59 చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ జాబితాలో టిక్టాక్, షేర్ఇట్, యుసీ బ్రౌజర్, బైదు మ్యాప్, హెలో, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్ ఫ్యాక్టరీ, వీచాట్, యుసి న్యూస్, వీబో, జెండర్, మీటు, కామ్స్కానర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్ ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ Ministry of Electronics and Information Technology (MeitY) జారీ చేసిన ఉత్తర్వులలో భారత ప్రభుత్వం ఈ 59 యాప్స్ ను భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రత, దేశ యొక్క రక్షణ, భద్రత దృష్ట్యా నిషేధిస్తున్నట్లు పేర్కొంది.    First published: