‘బావగారూ బాగున్నారా..’ టిక్ టాక్ వీడియో కోసం ఏకంగా పిల్లాడిని..

ఇటీవల టిక్ టాక్ యాప్‌ను సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అయినా ఇప్పటికే చాలా మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ఉండడంతో పెద్దగా ప్రభావం పడలేదు.

news18-telugu
Updated: April 18, 2019, 6:17 PM IST
‘బావగారూ బాగున్నారా..’ టిక్ టాక్ వీడియో కోసం ఏకంగా పిల్లాడిని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టిక్ టాక్‌లో ఫేమస్ కావడం కోసం జనం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. వాటిని టిక్ టాక్‌లో పోస్ట్ చేసి ఆనందం పొందుతున్నారు. ఈ క్రమంలో ఓ జంట బావగారూ బాగున్నారా? సినిమాలో సీన్‌ను టిక్ టాక్ వీడియో కోసం ట్రై చేసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం చనిపోయాడని భావించిన హీరోయిన రంభ.. అతడిని ఫ్రిజ్‌లో పెడుతుంది. ఆ తర్వాత చిరంజీవి వచ్చి ఫ్రిజ్‌లో ఉన్న మనిషిని బయటకు తీస్తాడు. ఆ సీన్ గుర్తుంది కదా. ఈ జంట కూడా సేమ్ టు సేమ్ అలాగే చేసింది. అయితే, ఇందులో బ్రహ్మానందం క్యారెక్టర్‌లో ఓ చిన్నపిల్లాడిని పెట్టింది. ఫ్రిజ్‌లో పిల్లాడిని దాచిపెట్టారు. వీడియో తీసినంత సేపు ఆ పిల్లాడిని ఫ్రిజ్‌లోనే పెట్టారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.టిక్ టాక్‌లో ఇలాంటివే కాకుండా, రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియో కోసం తన ఫ్రెండ్ తల మీద గన్ పెట్టి వీడియో కోసం ట్రై చేశాడు. ఆ సమయంలో గన్ పేలింది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ యాప్‌ను సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున వినతులు రావడం, పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీంకోర్టు టిక్ టాక్ యాప్‌ను రద్దు చేసింది.
First published: April 18, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading