#Jobs: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాల పండగ!

రెండు కంపెనీలు సుమారు 80,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. అందరూ తాత్కాలిక ఉద్యోగులే అయినా ఈ నెల రోజుల పాటు వారికి ఉపాధి లభించినట్టే. కష్టానికి తగ్గట్టే మంచి వేతనం కూడా లభిస్తుంది. ఈ సేల్స్ సమయంలో పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.

news18-telugu
Updated: October 17, 2018, 5:36 PM IST
#Jobs: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాల పండగ!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫెస్టివల్ సీజన్ వస్తే ఇ-కామర్స్ సైట్లకు పండగే. ఎందుకంటే భారీ ఆఫర్లతో సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ఆఫర్లు కస్టమర్లకూ మంచి లాభాలే తీసుకొస్తాయి. అయితే ఇ-కామర్స్ కంపెనీలు నిర్వహించే సేల్స్ వల్ల లక్షల్లో ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఈ వారంలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ముగిశాయి. సేల్స్ ప్రారంభించడానికంటే ముందే ఆయా కంపెనీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ రెండు కంపెనీలు సుమారు 80,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. అందరూ తాత్కాలిక ఉద్యోగులే అయినా ఈ నెల రోజుల పాటు వారికి ఉపాధి లభించినట్టే. కష్టానికి తగ్గట్టే మంచి వేతనం కూడా లభిస్తుంది. ఈ సేల్స్ సమయంలో పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.

గత కొన్ని నెలల్లో సప్లై చెయిన్, లాజిస్టిక్స్ యూనిట్ కోసం ఫ్లిప్‌కార్ట్ 30,000 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న సెల్లర్ పార్ట్‌నర్స్ ఐదు లక్షల ఉద్యోగాల్ని పరోక్షంగా సృష్టించారని అంచనా. వీరిలో ఎక్కువగా డెలివరీ బాయ్స్, ప్యాకేజింగ్ బాయ్సే. వీరిని నేరుగా ఉద్యోగాలకు పంపకుండా ఇ-కామర్స్ కంపెనీలు వారికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్‌ మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చాయి. అందరూ పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించడంలో శిక్షణ పొందారు. వీరందరికీ సప్లై చెయిన్స్, ఫుడ్-టెక్ లాంటి కంపెనీల్లో పనిచేయడానికి తగిన అర్హతలు లభించినట్టే.

అమెజాన్ ఇండియాకు భారతదేశంలో 50 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, మల్టిపుల్ సార్టేషన్ సెంటర్స్, 150 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయి. అమెజాన్ కూడా 50,000 మందిని తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకుంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో పికప్, ప్యాకింగ్, షిప్పింగ్, డెలివరీ లాంటి సేవల కోసం వీరిని నియమించుకున్నారు. అంతేకాదు... ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు భాషల్లో కాల్ సెంటర్ సపోర్ట్ కోసం కొందర్ని నియమించుకున్నారు.

ఇక ఈ దసరా సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు సుమారు రూ.15,000 కోట్ల అమ్మకాలు జరిపాయని అంచనా. గతేడాదితో పోలిస్తే ఈసారి సేల్స్ ఏకంగా 64 శాతం పెరిగాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆ మేరకు ఆన్‌లైన్ విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న పట్టణాల నుంచి 80 శాతం మంది కొత్త వినియోగదారులు కొనుగోళ్లు జరిపారు. తమకు వచ్చిన ఆర్డర్లలో 99% డెలివరీలు చేయడం విశేషం.



ఇవి కూడా చదవండి:

గోల్డ్ బాండ్ స్కీమ్: మీకు ఎంత వరకు లాభం?

కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ 18 అంశాలు మర్చిపోవద్దు!కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?
First published: October 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు