భాగస్వామి కదలికలపై నిఘా పెట్టే స్పై యాప్స్!

మీ భర్త మరో అమ్మాయికి దగ్గరవుతున్నాడని మీరు అనుమానిస్తున్నారా? మీ భార్య ప్రవర్తనపై మీకు అనుమానాలున్నాయా? అయితే మా యాప్ వాడి వారి కదలికలు తెలుసుకోండి అంటూ ఆన్‌లైన్ మార్కెట్లో వేలల్లో స్పైయింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ వల్ల లాభాల సంగతేమో కానీ కాపురాలు కూలిపోతున్న ఘటనలే ఎక్కువ.

news18-telugu
Updated: July 26, 2018, 11:54 AM IST
భాగస్వామి కదలికలపై నిఘా పెట్టే స్పై యాప్స్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పదులు... వందలు కాదు... వేలల్లో స్పైయింగ్ యాప్స్... ఇవి ఎందుకోసమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రియురాలిపై అనుమానం ఉన్న ప్రియుడు.... ప్రియుడి తీరుపై డౌట్ ఉన్న ప్రేయసి... భార్యపై అనుమానంతో భర్త... మొగుడి లీలల్ని తెలుసుకునేందుకు భార్య... వీళ్లే అలాంటి యాప్స్ ఎక్కువగా వాడేది. వాటిని చట్ట విరుద్ధంగా ఎలా వాడొచ్చో తెలిపే వీడియోలు, కథనాలు ఆన్‌లైన్‌లో ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఇలాంటి యాప్స్ తయారుచేసేవాళ్ల ఆన్‌లైన్ మార్కెటింగ్ కూడా జోరుగా ఉంటుంది. అలాగని ఈ యాప్స్ చెడ్డవేమీ కావు. తమ పిల్లల్ని ట్రాక్ చేసేందుకు తల్లిదండ్రులూ ఉపయోగిస్తుంటారు. పిల్లలు దారితప్పుతున్నారని తెలిస్తే జాగ్రత్తపడుతుంటారు. ఇందులో ట్రెడిషనల్ స్పైవేర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇది నిరంతరం ట్రాక్ చేస్తూ అప్‌డేట్స్ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న యాంటీ-స్పైవేర్ టూల్స్‌తో స్పయింగ్ యాప్స్ అడ్డుకోవడం కష్టం.

"మొబైల్ యాప్ ఫర్ పర్సనల్ క్యాచ్ ఛీటింగ్ స్పౌసెస్" అంటే "మోసం చేసే మీ భాగస్వామిని పట్టిచ్చే మొబైల్ స్పై యాప్" అనే పేరుతో ఏకంగా ఓ వెబ్‌ పేజ్ ఉంది. అయితే ఈ యాప్స్ కేవలం ప్రేమికులు, భాగస్వాముల కోసమే కాదు కంపెనీలు తమ ఉద్యోగుల్ని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగించడం మామూలే. అయితే ప్రకటనల్లో మాత్రం "మీ గాళ్‌ఫ్రెండ్‌ని ట్రాక్ చేయండి" లేదా "మోసం చేసే మీ భాగస్వామిని తన సెల్‌ఫోన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోండి" అని ప్రచారం చేస్తుండటమే విడ్డూరం.

ఇలాంటి స్పైయింగ్ యాప్స్ ఓపెన్ మార్కెట్‌లో వేలల్లో ఉన్నాయి. వాటిని సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న యాంటీ-స్పైవేర్ వాటిని గుర్తించలేవు కూడా. దీంతో బాధితులు తమపై నిఘా పెట్టారని కూడా తెలుసుకోలేరు.
రాహుల్ ఛటర్జీ, డాక్టోరల్ స్టూడెంట్


తమ భాగస్వామి కదలికలు, ఎవరితో ఛాట్ చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారో లాంటి ఆన్‌లైన్ నిఘా వల్ల గృహ హింస బాధితులు పెరిగిపోతున్నారని అంచనా. ఇలాంటి ఘటనలు దాడుల వరకు వెళ్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు తీస్తున్న ఘటనలూ ఉన్నాయి. భార్యాభర్తలు, ప్రేమికులు ఒకరి ఫోన్లు మరొకరు తరచూ చూడటం, పాస్‌వర్డ్స్ తెలుసుకొని మరీ ఆపరేట్ చేస్తుండటంతో ఇలాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసే అవకాశం సులువుగా లభిస్తోంది. ఇలా అక్రమంగా నిఘా పెట్టే యాప్స్‌ గురించి పరిశోధకులు తమ అధ్యయన వివరాలను గూగుల్‌కు వెల్లడించారు. దీంతో గూగుల్ అలాంటి యాప్స్‌కు సంబంధించిన ప్రకటనల్ని, సెర్చ్ టర్మ్స్‌ని ఆపేసింది. అంతేకాదు ప్లేస్టోర్‌లో నియమనిబంధనల్ని మార్చింది.

గూగుల్‌లో "భాగస్వామి కదలికలపై ఎలా నిఘా పెట్టాలి", "మరొకరి ఫోన్‌లో ఎస్ఎంఎస్ ఎలా చదవాలి" లాంటి పదాలతో సెర్చ్ చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు ఇలాంటి విషయాలు స్టెప్ బై స్టెప్ వివరించే బ్లాగ్స్, వీడియోలు, ఛాట్ ఫోరమ్స్ చాలా ఉన్నాయి. గూగుల్ కానీ, యాపిల్ కానీ ఇలాంటి స్పైయింగ్ యాప్స్ తమ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మట్లేదు. అయితే చాలా స్పైయింగ్ యాప్స్ ఆన్‌లైన్ మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. ఇవన్నీ చట్టబద్ధమైన యాప్స్ అని తయారీదారులు చెప్పుకుంటున్నా... చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున గూగుల్, యాపిల్‌లో మాత్రం వాటిని అమ్మట్లేదు.

రీసెర్చర్స్ అలాంటి 11 యాప్స్ అమ్ముతున్న కంపెనీల కస్టమర్ కేర్‌కు కాల్ చేసి "నేను ఈ యాప్‌తో నా భాగస్వామిని ట్రాక్ చేస్తున్నట్టు తనకు తెలుస్తుందా" అని అడిగితే 9 మంది నుంచి "లేదు. తెలుసుకునే అవకాశం లేదు" అని సమాధానం వచ్చింది. అంటే ఈ స్పైయింగ్ యాప్స్ ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి యాప్స్‌ని కూడా గుర్తించగలికే స్పై-వేర్ డిటెక్షన్ టూల్ తయారుచేసేపనిలో ఉన్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలు.
Published by: Santhosh Kumar S
First published: July 26, 2018, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading