Flipkart Offers | మీరు కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరకే స్మార్ట్ టీవీని (Smart TV) కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. థామ్సన్ టీవీపై భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
థామ్సన్ అల్ఫా 32 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ లినుక్స్ టీవీ అందుబాటు ధరలోనే ఉంది. దీని ఎంఆర్‌పీ రూ. 14,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 7,499కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది. రూ. 750 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 6749కే లభించినట్లు అవుతుంది.
గుడ్ న్యూస్.. రూ.770 పడిపోయిన బంగారం ధర.. వెండి రూ.1,800 పతనం!
ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 30 వాట్ ఔట్‌పుట్ సౌండ్ ఉంది. అలాగే 60 హెర్జ్ట్ రిఫ్రెష్ రేటు ఉంది. లినుక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ పని చేస్తుంది. అలాగే ఇందులో మీరు ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి పలు యాప్స్‌ను చూడొచ్చు. బెజిల్ లెస్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ టీవీ అదరగొడుతోందని చెప్పుకోవచ్చు. బిల్ట్ ఇన్ వైఫై, మీరాకాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఇందులో మలి క్వాడ్ కోర్ జీపీయూ ప్రాససర్ అమర్చారు. అలాగే అమ్‌లాజిక్ చిప్‌సెట్ ఉంది.
ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. రూ.5 వేల కన్నా ఎక్కువ డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు!
ఇప్పటికే ఈ స్మార్ట్ టీవీని చాలా మంది కొనుగోలు చేశారు. దీన్ని మీరు ఒకేసారి డబ్బులు చెల్లించి కొనొచ్చు. లేదంటే ఈఎంఐ రూపంలో కొనొచ్చు. 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 361 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడే వారికి ఈ బెనిఫిట్ ఉంటుంది. అదే కార్డు లేకపోతే అప్పుడు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వాడే వారికి అయితే ఇంకా తక్కువ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 264 చెల్లిస్తే సరిపోతుంది. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా అయితే 12 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 710 కట్టాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Flipkart, Flipkart offers, Smart TV