కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart). ఈ ప్లాట్‌ఫామ్ ‘మొబైల్ ఫోన్స్ బొనాంజా సేల్’ పేరుతో సరికొత్త సేల్ ఈవెంట్‌ను నవంబర్ 8న లాంచ్ చేసింది. ఈ రోజుతో ముగిసే స్పెషల్ ఆఫర్లలో టాప్ బ్రాండ్స్‌కు చెందిన వివిధ రకాల స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వివో T1X (Vivo T1X) మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అనౌన్స్ చేసింది.
వివో T1X స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో (4 GB RAM +64 GB స్టోరేజ్), (4 GB RAM +128 GB స్టోరేజ్) లభిస్తుంది. 4GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.17,990గా ఉంది. అయితే బొనాంజా సేల్ సందర్భంగా దీనిపై ఫ్లిప్‌కార్ట్ 27 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఇప్పుడు దీన్ని రూ.12,999కు సొంతం చేసుకోవచ్చు. అలాగే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10శాతం(రూ.750)వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వేరియంట్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది.
కిల్లింగ్ ఆఫర్.. రూ.37,000 ఫోన్‌ను రూ.13 వేలకే కొనండి
4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఈ వేరియంట్ మార్కెట్లో రూ.16,990 ధరతో లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.11,999కు ఆఫర్ చేస్తోంది. ఈ డీల్‌పై మొత్తంగా ఫ్లిప్‌కార్ట్ 29 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇక యాక్సెస్ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే 10 శాతం (రూ.750) అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై రూ.11,050 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
5జీ ఫోన్‌పై రూ.20 వేల డిస్కౌంట్.. 108MP కెమెరా, 17 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD+ రిజల్యూషన్‌తో కూడిన డిస్ప్లేతో లభిస్తుంది. LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 90.0 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 SoCతో రన్ అవుతుంది. Adreno 610 GPUకి ఇది సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇతర డివైజ్‌ల నుంచి ఛార్జ్ చేయవచ్చు. స్మూత్ హీట్ డిస్పెన్షన్తో ఫోర్ లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేశారు.
వివో T1Xలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 2MP సెన్సార్ ఉంటుంది. ఈ కెమెరాలు సూపర్ హెచ్డీఆర్, మల్టీ-లేయర్ పోర్ట్రెయిట్, స్లో మోషన్, పనోరమా, లైవ్ ఫోటో, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పని చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Latest offers, Mobile offers, Smartphone, Vivo