కాంతి వేగం... రియల్ టైమ్ విజువల్ షో... వైరల్ వీడియో

Light Travel : ఈ విశ్వంలో అన్నింటి కంటే వేగంగా వెళ్లేది కాంతి. అందువల్ల కాంతి ప్రయాణం సైంటిస్టులకు ఎప్పటికీ ఓ అంతుబట్టని రహస్యం. ఐతే... కాంతి వేగాన్ని కొలిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: October 8, 2019, 10:37 AM IST
కాంతి వేగం... రియల్ టైమ్ విజువల్ షో... వైరల్ వీడియో
కాంతి వేగం... రియల్ టైమ్ విజువల్ షో... వైరల్ వీడియో (credit - YT - Dr James O'Donoghue)
  • Share this:
Speed of Light : కాంతి వేగం సెకండ్‌కి 3 లక్షల కిలోమీటర్లు. సూర్యుడి నుంచీ భూమికి కిరణాలు ప్రసరించడానికి 8 నిమిషాలు పడుతుందని మనకు తెలుసు. ఎందుకంటే... సూర్యుడికీ భూమికీ మధ్య దూరం ఎక్కువ కాబట్టి. అదే చందమామకీ భూమికీ మధ్య కాంతి రెప్పపాటులో ప్రయాణించగలదు. ఎందుకంటే... రెండింటి మధ్యా దూరం 3,84,400 కిలోమీటర్లు కాబట్టి. ఈ విశ్వంలో అన్నింటి కంటే వేగంగా వెళ్లేది కాంతే. అది అంత వేగంతో ఎలా వెళ్లగలుగుతోందో శాస్త్రవేత్తలకు అంతుబట్టట్లేదు. ఈ క్రమంలో... అసలు కాంతి వేగం ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రయత్నించారు డాక్టర్ జేమ్స్ ఓ డోనోగ్. జపాన్ స్పేస్ ఏజెన్సీ జక్సాలో ప్లానెటరీ సైంటిస్ట్ అయిన ఆయన... ప్రత్యేక లెక్కలు కట్టి... భూమి చుట్టూ కాంతి ఎంత వేగంతో వెళ్తుందో... అలాగే... భూమికీ సూర్యుడికీ మధ్య కాంతి వేగం ఎలా ఉంటుందో గ్రాఫిక్స్ యానిమేషన్ ద్వారా చూపించారు. చందమామ, మార్స్, భూమి మధ్య కాంతి వేగాన్ని కూడా విజువలైజ్ చేశారు.జేమ్స్ ఇదివరకు నాసాకి చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో కూడా పనిచేశారు. ఆయన రూపొందించిన ఈ వీడియోకి యూట్యూబర్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదో మంచి ప్రయత్నమనీ, విద్యార్థులకు కాంతి వేగంపై మంచి అవగాహన వస్తుందని అంటున్నారు.

 

Pics : ముద్గుగా... బొద్దుగా... ఆకట్టుకుంటున్న షాలిన్ జోయా

ఇవి కూడా చదవండి :

ఈలలు, బుల్లెట్ సౌండ్లు... మిమిక్రీతో ఆశ్చర్యపరుస్తున్న పక్షి

Dussehra 2019 : దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

జబర్దస్త్ రష్మీ ప్లాన్ అదిరిందిగా... ఆ హీరోయిన్లకు చెక్

కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి... నేడు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనం

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...
First published: October 8, 2019, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading