హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

CZ Smartwatch: గుండెపోటును ముందే పసిగట్టే స్మార్ట్‌వాచ్‌? నాసా,AI టెక్నాలజీతో వస్తున్న డివైజ్‌ వివరాలివే..

CZ Smartwatch: గుండెపోటును ముందే పసిగట్టే స్మార్ట్‌వాచ్‌? నాసా,AI టెక్నాలజీతో వస్తున్న డివైజ్‌ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా సిటిజన్ వాచ్ బ్రాండ్ సంస్థ సరి కొత్త ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌ లాంచ్‌ చేసింది. ఈ డివైజ్‌ అలసటను లెక్కిస్తుందని, గుండెపోటును ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుందని కంపెనీ తెలిపింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

CZ Smartwatch : కొంత కాలంగా స్మార్ట్‌వాచెస్‌లో లేటెస్ట్‌ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫిట్నెస్‌, హెల్త్‌ ట్రాకింగ్‌ కోసం మెరుగైన ఆప్షన్లు అందిస్తున్నాయి. తాజాగా సిటిజన్ వాచ్ బ్రాండ్ సంస్థ సరి కొత్త ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌ లాంచ్‌ చేసింది. ఈ డివైజ్‌ అలసటను లెక్కిస్తుందని, గుండెపోటును ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, నాసా టెక్నాలజీ ఈ వాచ్‌ పని చేస్తుందని వివరించింది. ఇటీవల అమెరికా లాస్‌వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2023లో ఈ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది.

స్మార్ట్‌వాచ్‌ ఎలా పనిచేస్తుంది ?

ప్రముఖ సిటిజన్ బ్రాండ్‌ లాంచ్‌ చేసిన స్మార్ట్‌వాచ్‌ ఏఐ, నాసా టెక్నాలజీతో పని చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా వాచ్ ధరించిన వ్యక్తి ఎటువంటి అలసటకు గురైనా వెంటనే అలర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వాచ్ సూచనలు చేస్తుంది. ఈ సిటిజన్ బ్రాండ్ వాచ్‌లో ‘CZ Smart YouQ’ అప్లికేషన్ ఉంటుంది. దీని ఆధారంగా వాచ్‌లో ఉన్న కొత్త ఫీచర్ పనిచేస్తుంది. ప్రతిరోజూ ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా అలర్ట్‌ మానిటర్ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ అలర్ట్ మానిటర్ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది.

సిటిజన్ వాచ్‌లో నాసా టెక్నాలజీ

అంతరిక్షంలో వ్యోమగాములు అలసటకు, అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే వాటిని పసిగట్టేందుకు వ్యోమగాములు వేసుకున్న సూట్‌లోనే ‘సైకోమోటర్ విజిలెన్స్ టాస్క్ టెస్ట’ను అమర్చుతారు. అదే టెక్నాలజీని ఈ కొత్త సిటిజన్ బ్రాండ్ వాచ్‌లో అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్, నాసా కలిసి ఈ కొత్త టెక్నాలజీ వాచ్‌లను తయారు చేసినట్లు సిటిజన్ వాచ్ అమెరికా ప్రెసిడెంట్ జెఫ్రీ కోహెన్ తెలిపారు.

గుండె సమస్యల అలర్ట్స్‌

గుండెపోటు సమస్యతో బాధపడే వారికి ఈ వాచ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హార్ట్ రేట్‌ను ఎప్పిటికప్పుడు చెక్‌చేసి క్యాల్కులేట్ చేస్తుంది. గుండెపోటు రావడానికి ముందు ఈ వాచ్ అప్రమత్తం చేస్తుంది.

ధర ఎంత? మార్కట్‌లో ఎప్పుడు అందుబాటులో వస్తుంది?

సిటిజన్ బ్రాండ్‌కు సంబంధించిన సెకండ్ జనరేషన్ వాచీల్లోనే ఈ కొత్త ‘YouQ’ అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని సిటిజన్ వాచ్ యాజమాన్యం తెలిపింది. ఈ యూక్యూ ఫీచర్‌తో పాటు వాచీలో 24 గంటల బ్యాటరీ, గూగుల్ ఫిట్, స్ట్రావా, స్పోటిఫై, యూట్యూబ్ మ్యూజిక్, అమెజాన్ అలెక్సా, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ కంపాటబిలిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ప్రదర్శనకు మాత్రమే పెట్టిన ఈ ‘సిటిజన్ యూక్యూ’వాచ్, 2023 మార్చ్‌ నుంచి అమెరికన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు రూ.31,000 (350 డాలర్లు) ఉంటుంది. ఇప్పుడున్న ఫిట్‌నెస్ వాచీలతో పోలిస్తే ఇందులో చాలా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. నాసా టెక్నాలజీతో తయారైన.. ఈ స్మార్ట్‌వాచ్‌.. హెల్త్ అలర్ట్‌ కావాలనుకున్న వారికి బెస్ట్‌ ఛాయిస్‌ అవుతుంది.

First published:

Tags: Technolgy

ఉత్తమ కథలు