2020లో మరో బ్యాడ్ న్యూస్... సూర్యుడి నుంచి ప్రళయం రాబోతోందా?

ఈ సంవత్సరం మనం చాలా చెడు వార్తలు చూస్తున్నాం. వాటిలో ఇది కూడా చేరుతోంది. భూమికి ప్రళయం రాబోతోందా?

news18-telugu
Updated: August 10, 2020, 8:48 AM IST
2020లో మరో బ్యాడ్ న్యూస్... సూర్యుడి నుంచి ప్రళయం రాబోతోందా?
2020లో మరో బ్యాడ్ న్యూస్... సూర్యుడి నుంచి ప్రళయం రాబోతోందా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సూర్యుడు మండే అగ్నిగోళం అని మనకు తెలుసు. అదే సూర్యుడిపై అక్కడక్కడా నల్లటి మచ్చలున్నాయి. వాటినే మనం సన్ స్పాట్ (Sunspot) అని పిలుస్తాం. వాటిలో అతి పెద్దది ఇప్పుడు భూమివైపు తిరుగుతోంది. అది మనకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే... AR2770 అనే సన్ స్పాట్... క్రమంగా సైజు పెరుగుతోంది. దీని నుంచి అత్యంత భయంకరమైన రాకాసి అగ్ని అలలు ఎగసిపడుతున్నాయి. వాటి నుంచి వెలువడే అగ్ని సునామీలు... అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఐదు సునామీలు వచ్చాయి. వాటివల్ల భూమికి ఏమీ కాలేదు. ఎందుకంటే అవి మరీ పెద్దవి కావు.

2020లో మరో బ్యాడ్ న్యూస్... సూర్యుడి నుంచి ప్రళయం రాబోతోందా? (ప్రతీకాత్మక చిత్రం)


దాదాపు 50 వేల కిలోమీటర్లంత సైజున్న ఈ సన్ స్పాట్ నుంచి భారీగా ఎనర్జీ రిలీజ్ అయితే... అది పెను ప్రళయానికి దారి తీయడం ఖాయం. ఇలా రోదసిలోకి సూర్యుడి నుంచి భారీ వేడి సునామీలు వెళ్లడాన్ని కరొనల్ మాస్ ఇజెక్షన్స్ (CME) అంటారు. ఇవి భూమిపై ఉండే రేడియో తరంగాల్ని దెబ్బతీస్తాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేయగలవు. భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల GPS దెబ్బ తినగలదు. అంతేకాదు... పవర్ గ్రిడ్లు కూడా పనిచేయకుండా పోగలవు.

2020లో మరో బ్యాడ్ న్యూస్... సూర్యుడి నుంచి ప్రళయం రాబోతోందా? (ప్రతీకాత్మక చిత్రం)


యూరప్ దేశాల్లో కనిపించే అరోరా గాలులకు కారణం... ఈ CMEలే. ఇవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని దెబ్బతీయగలవని అంటున్నారు.

సన్ స్పాట్ అనేది సూర్యుడిపై నల్లగా కనిపించే ప్రదేశం. మిగతా ప్రదేశాల కంటే అది కొద్దిగా చల్లగానే ఉంటుంది. దాని నుంచి భారీగా వాయువులు, అత్యంత శక్తిమంతమైన అయస్కాంత తరంగాలూ వస్తుంటాయి. సూర్యుడి అయస్కాంత క్షేత్రాల్లో మార్పులు వచ్చినప్పుడు భారీ పేలుళ్లు సంభవిస్తాయి. అవి ఒక్కోసారి భూమి కంటే పెద్దగా ఉంటాయి. పేలుళ్ల నుంచి వచ్చే శక్తి... హిరోషిమా నాగసాకిపై పడిన అణుబాంబు కంటే... కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విడుదలయ్యే రాకాసి వేడి సునామీ (CME)... భూమికి ప్రమాదంగా మారగలదు.

నాసా తాజాగా తయారుచేసిన మోడల్ ప్రకారం... గత పదేళ్లలో ఏడు భారీ CMEలను గుర్తించింది. ఇప్పుడు సన్ స్పాట్... భూమివైపుకి తిరుగుతోంది కాబట్టి... ఇప్పుడు భారీ CME వస్తే భూమికి ప్రమాదమే. రాకూడదని కోరుకుందాం.
Published by: Krishna Kumar N
First published: August 10, 2020, 8:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading