అంతరిక్షం నుంచి సూర్యాస్తమయం ఎలా ఉంటుందో తెలుసా?

మనం భూమిపై ఉంటూ.... రోజూ సూర్యాస్తమయం చూస్తాం. మరి అంతరిక్షం నుంచి సూర్యాస్తమయం ఎలా ఉంటుంది?

news18-telugu
Updated: June 21, 2020, 12:50 PM IST
అంతరిక్షం నుంచి సూర్యాస్తమయం ఎలా ఉంటుందో తెలుసా?
అంతరిక్షం నుంచి సూర్యాస్తమయం ఎలా ఉంటుందో తెలుసా? (credit - twitter)
  • Share this:
మనందరికీ తెలుసు... సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆకాశం ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉండే మేఘాలు కూడా ఆ రంగుల్లోనే మెరుస్తాయి. ఇందుకు కారణం... సూర్యుడిలోని ఏడు రంగులు భూమిపై ప్రసరించడమే. ఐతే... అదే దృశ్యాన్ని అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఆ ఎరుపు, పసుపు రంగులు ఎంత దూరం ఉంటాయి. వాటి అవతల భూమి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగామి అలెగ్జాండర్ గెరెస్ట్ సమాధానం కనుక్కున్నారు. అంతరిక్షంలో ఇప్పుడున్న వ్యోమగాముల కంటే... ఎక్కువగా.... 362 రోజులు రోదసిలో ఉన్న ఆయన... సూర్యాస్తమయం సమయంలో... భూమిని ఫొటో తీసి... ప్రపంచానికి చూపించారు.


ఈ ఫొటోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసారు. హారిజన్స్ మిషన్ సమయంలో... దీన్ని తీసినట్లు అలెగ్జాండర్ తెలిపారు. ఇది చాలా క్రియేటివ్‌గా ఉందనీ, కొత్త విషయం తెలుసుకున్నామని నెటిజన్లు అంటున్నారు.
First published: June 21, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading