• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • THIS IS THE SPECIALTY OF ACT CCTV CAMERA THE OPPORTUNITY TO CONNECT TO WIFI AND WATCH LIVE RECORDINGS MK GH

ACT CCTV Camera స్పెషాలిటీ ఇదే... వైఫైతో కనెక్ట్ చేసుకొని లైవ్ రికార్డింగ్‌ చూసే అవకాశం

ACT CCTV Camera స్పెషాలిటీ ఇదే... వైఫైతో కనెక్ట్ చేసుకొని లైవ్ రికార్డింగ్‌ చూసే అవకాశం

ఫ్రతీకాత్మకచిత్రం

ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే ACT ఫైబర్ నెట్ సంస్థ స్మార్ట్ ఉత్పత్తుల తయారీ విభాగంలోకి అడుగుపెట్టింది. ఆ సంస్థ తాజాగా హోమ్ సర్వైలెన్స్ సెక్యూరిటీ కెమెరాను మార్కెట్లోకి విడుదల చేసింది. యాక్ట్ హోమ్ క్యామ్ పేరుతో ఈ సీసీటీవీ కెమెరాను సంస్థ రూపొందించింది.

  • Share this:
ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే ACT ఫైబర్ నెట్ సంస్థ స్మార్ట్ ఉత్పత్తుల తయారీ విభాగంలోకి అడుగుపెట్టింది. ఆ సంస్థ తాజాగా హోమ్ సర్వైలెన్స్ సెక్యూరిటీ కెమెరాను మార్కెట్లోకి విడుదల చేసింది. యాక్ట్ హోమ్ క్యామ్ పేరుతో ఈ సీసీటీవీ కెమెరాను సంస్థ రూపొందించింది. వైఫై ఆధారంగా పనిచేసే ఈ కెమెరాను సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే టీపీ-లింక్ టాపో యాప్‌కు యూజర్లు ఇంట్లో అమర్చుకున్న సెక్యూరిటీ కెమెరాను సింక్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఏర్పాటు చేసిన యాక్ట్ సెక్యూరిటీ కెమెరాలను స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. యూజర్లు ఎక్కడినుంచైనా తమ సీసీ కెమెరా ఫుటేజీని ప్రత్యక్షప్రసారం ద్వారా చూసుకోవచ్చు. కానీ యాక్ట్ నెట్‌వర్క్‌ కస్టమర్లే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.

సెక్యూరిటీ కెమెరా కోసం యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ టీపీ-లింక్‌తో ఒప్పందం చేసుకుంది. భారత్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన యాక్ట్ హోమ్ క్యామ్ ధర రూ.2,249గా ఉంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ తీసుకోని వారికి ఈ ధర వర్తిస్తుంది. నెలకు రూ.200 చొప్పున చెల్లిస్తూ కెమెరా సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇందుకు కస్టమర్లు అదనంగా రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ కెమెరాను సంస్థ అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాక్ట్ ఫైబర్ నెట్ చందాదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
యాక్ట్ హోమ్ క్యామ్‌లో 2 మెగాపిక్సెల్ HD కెమెరా ఉంటుంది. ఇది నైట్ విజన్ ఇన్‌ఫ్రారెడ్ లెన్సులను కలిగి ఉంటుంది. ఇందులో 1080p రికార్డింగ్, 110 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంట్లో ఉండే హెచ్‌డీ కెమెరా, 30 అడుగుల వ్యూ వరకు క్వాలిటీ వీడియోలను రికార్డు చేయగలదు. హోమ్ క్యామ్ డివైజ్‌లో మోషన్ డిటెక్షన్ సపోర్ట్ కూడా ఉంది. దీని పరిధిలో ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే యూజర్లను హెచ్చరిస్తుంది. వీడియో ఫుటేజీ స్టోరేజీ కోసం మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఉంది. దీంట్లో 24 రోజుల పాటు 128GB ఫుటేజీని సేవ్ చేసుకోవచ్చు. వినియోగదారులు అవసరాన్ని బట్టి కెమెరాను ఆన్, ఆఫ్ చేసుకోవడానికి, ప్లే బ్యాక్ ఆప్షన్ కోసం ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లు
కస్టమర్లు ఒకటికంటే ఎక్కువ యాక్ట్ హోమ్ క్యామ్ యూనిట్లను ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటన్నింటి లైవ్ స్ట్రీమింగ్‌ను టీపీ లింక్ టాపో యాప్ ద్వారా చూడవచ్చు. ఈ డివైజ్‌ కెమెరా టూ వే టాకింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంట్లో పాన్ టిల్ట్ జూమ్ (PTZ) ఫీచర్ కూడా ఉంటుంది. దీని ద్వారా యూజర్లు కెమెరాను 360 డిగ్రీల యాంగిల్‌కు తిప్పవచ్చు. యాప్ ద్వారా కెమెరా లెన్సును 110 డిగ్రీలు టిల్ట్ చేయవచ్చు. టాపో యాప్ ద్వారా ఈ సేవలను సులభంగా ఉపయోగించుకోచ్చు.
First published: