Home /News /technology /

THIS IS THE LATEST PHONE REVIEW OF THE LAUNCH OF NOTHING PHONE 1 IN THE GLOBAL MARKET UMG GH

Nothing Phone (1) Review: గ్లోబల్ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్‌ (1) లాంచ్‌.. ఫోన్ ఫుల్ రివ్యూ మీకోసం..!

నథింగ్ (1) ఫోన్ రివ్యూ

నథింగ్ (1) ఫోన్ రివ్యూ

కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ (1)’ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ డివైజ్ రివ్యూ చూద్దాం.

కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘నథింగ్ ఫోన్ (1)’ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇండియాలో నథింగ్ ఫోన్(1) బేస్ వేరియంట్‌ 8GB/128GB మోడల్‌ ధర రూ.32,999గా ఉంది. 8GB/256GB మోడల్‌ను రూ.35,999కు, 12GB/256GB వేరియంట్‌ను రూ.38,999కు సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ వివరాలతో ఈ డివైజ్ ఫుల్ రివ్యూ చూద్దాం.

* ఆకట్టుకుంటున్న LEDలు
నథింగ్ ఫోన్(1) అత్యంత ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో LED లు కొత్త కాకపోయినా.. నథింగ్‌ ఫోన్‌(1) LEDలు విభిన్నంగా ఆకర్షిస్తున్నాయి. హ్యాండ్‌సెట్ డిజైన్‌ను మరింత పెంచాయి. ఫోన్‌కు వెనుక, ముందు భాగంలో గొరిల్లా గ్లాస్‌ ఉంది. అదనంగా హ్యాండ్‌సెట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడా వస్తుంది. ఫోన్ వెనుక భాగం ట్రాన్సపరెంట్‌గా ఉంటుంది. వెనుక భాగంలో చూడగలిగే ఏకైక భాగం వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్. పైభాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దాని చుట్టూ LED లైట్ ఉంది. ఫోన్‌లో రౌండ్‌ ఎడ్జెస్‌ కాకుండా.. షార్ప్‌ ఎడ్జెస్‌ ఉన్నాయి. ఇది ఐఫోన్‌ను గుర్తు చేస్తుంది. ఫోన్(1) ఆశ్చర్యకరంగా బెస్ట్‌ సౌండ్‌ను అందించే డ్యూయల్ స్పీకర్ సెటప్‌తో వస్తుంది. ఫోన్ ఎడమవైపు వాల్యూమ్ బటన్‌లు, కుడివైపు పవర్ బటన్‌తో సాధారణ బటన్ ప్లేస్‌మెంట్‌లు ఉన్నాయి. USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, SIM ట్రే దిగువన ఉన్నాయి.

* డిస్‌ప్లే
నథింగ్ ఫోన్(1) 10-బిట్ కలర్స్‌తో 6.55-అంగుళాల FHD+ (2400x1080 పిక్సెల్‌లు) ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో స్క్రీన్ ఇచ్చారు. స్క్రీన్ 500 నిట్‌ల సాధారణ లైట్‌, 1200 నిట్‌ల గరిష్ట లైట్‌ను అందిస్తుంది. డే లైట్‌లో కూడా ఫోన్‌ను వీక్షించడానికి వీలుగా ఉంటుంది. స్క్రీన్‌పై HDR10+ సపోర్ట్‌ ఉంటుంది.

 ఇదీ చదవండి: యూరప్ మార్కెట్‌లో మన బ్యాగులకు ఫుల్ డిమాండ్.. మొత్తం ఒక్క విలేజ్ నుంచే వెళ్తాయంటా..! ఆ బ్యాగులను చూసేద్దామా..


* ప్రాసెసర్‌
ఈ ఫోన్‌ Adreno 642L GPUతో క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778G+ SoCతో పని చేస్తుంది. 12GB, LPDDR5 RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌ అందిస్తుంది. గీక్‌బెంచ్ 5లో, నథింగ్ ఫోన్ (1) సింగిల్-కోర్ స్కోర్ 732 పాయింట్లను, మల్టీ-కోర్ స్కోర్ 2872 పాయింట్లను సాధించింది. డివైజ్‌లో కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్, అపెక్స్ లెజెండ్స్ మొబైల్‌తో సహా కొన్ని గేమ్‌లు రన్‌ చేయగా.. మొదటి 30 నిమిషాల తర్వాత ఫోన్ కొద్దిగా వేడెక్కింది.

* కెమెరా
డ్యూయల్-కెమెరా సెటప్‌తో, ఫోన్ (1) ఓవర్-ది-టాప్ కెమెరా బ్రాండింగ్‌కు దూరంగా ఉంటుంది. రెండు సెన్సార్లు.. f/1.88 ఎపర్చరు, OISతో కూడిన 50 MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్ మరియు f/2.2 ఎపర్చర్‌తో కూడిన 50 MP Samsung JN1 అల్ట్రావైడ్ లెన్స్, వైడ్‌ 114-డిగ్రీ FoV అందించారు. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం f/2.45 ఎపర్చర్‌తో 16 MP సోనీ IMX71 సెన్సార్ ఉంది. నథింగ్ ఫోన్ (1) ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలలో 30fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయగలదు.

ప్రైమరీ కెమెరా డైనమిక్ రేంజ్‌తో ఫొటోలను అందిస్తుంది. డిఫాల్ట్ మోడ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు రంగులు ఎల్లప్పుడూ సహజంగా కనిపించవు కానీ అది చెడ్డ విషయం కాదు. ఫోన్ (1) రెండు లెన్స్‌ల మధ్య మంచి కలర్‌ కన్‌సిస్టెన్సీ అందిస్తుంది. నైట్ మోడ్ శబ్దాన్ని తగ్గించడానికి, వీడియోలలో డార్క్‌ ఏరియాలను ఎక్స్‌పోజ్‌ చేయడానికి సహాయపడుతుంది. 16 MP సెల్ఫీ కెమెరా సహజంగా కనిపించే స్కిన్ టోన్‌లను క్యాప్చర్ చేస్తుంది. నథింగ్ డ్యూయల్ 50 MP ఫార్ములా గెలుపొందింది.



* బ్యాటరీ
నథింగ్ ఫోన్(1) 4,500 mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోన్ (1) రోజంతా ఎక్కువగా వినియోగించినా స్క్రీన్-ఆన్ టైమ్‌ను పుష్కలంగా అందిస్తుంది. నథింగ్ ఫోన్ (1) 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

* సాఫ్ట్‌వేర్ పరంగా..
నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ 12 బేస్డ్ నథింగ్ OSతో రన్ అవుతుంది. ఇంటర్‌ఫేస్ ఆకట్టుకునేలా ఉంది.. పిక్సెల్ డివైజ్‌లలో మనం చూసే స్టాక్ ఆండ్రాయిడ్‌ను గుర్తుకు తెస్తుంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ అనేది ఫోన్ (1) మరొక అద్భుతమైన అంశంజ ఫోన్ వెనుక భాగంలో లైటింగ్‌ను సింక్రనైజ్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్‌లకు డిఫరెంట్‌ లైట్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ (1) సాంప్రదాయ మిడ్‌ రేంజ్‌ ఫార్ములా నుంచి వైదొలిగిందనడంలో సందేహం లేదు. చిప్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైనది కాదు కానీ ఇప్పటికీ ఎటువంటి సమస్యలు లేకుండా పని చేయగలదు. ఫోన్(1) అద్భుతమైన సాఫ్ట్‌వేర్, శక్తివంతమైన డిస్‌ప్లే, గణనీయమైన బ్యాటరీని అందించడం ద్వారా చాలా పనులను బాగా చేస్తుంది. రెండు వెనుక కెమెరాలు మాత్రమే ఉన్నప్పటికీ, బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నాయి. ప్రస్తుతానికి బాక్స్‌లో ఛార్జర్ లేకపోవడం ఫోన్‌పై వినిపిస్తున్న ఏకైక విమర్శ. అయితే రూ.32,999కి, నథింగ్ ఫోన్ (1) ప్రత్యేకమైనది, సెగ్మెంట్‌లోని అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.
Published by:Mahesh
First published:

Tags: 5g smart phone, New phone, Smartphones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు