ఇది ఫేక్ న్యూస్ కాదు...‘టిమ్ ఆపిల్‌’గా పేరు మార్చుకున్న టిమ్ కుక్

నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను పదేపదే టిమ్ ఆపిల్ అని సంబోధించారు. దీంతో తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో ‘ఆపిల్’ సంస్థ సీఈవో టిమ్ కుక్ తన పేరును టిమ్ ఆపిల్‌గా మార్చుకున్నారు

news18-telugu
Updated: March 8, 2019, 5:40 PM IST
ఇది ఫేక్ న్యూస్ కాదు...‘టిమ్ ఆపిల్‌’గా పేరు మార్చుకున్న టిమ్ కుక్
టిమ్ కుక్‌ని టిమ్ ఆపిల్ అని సంబోధించిన డొనాల్డ్ ట్రంప్
  • Share this:
టిమ్‌ కుక్‌. ప్రపంచ వ్యాప్తంగా ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ ‘ఆపిల్‌’ సీఈఓ అయిన ఆయన తన పేరును మార్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఓ పని, టిమ్ కుక్ తన పేరును మార్చుకునేందుకు ప్రేరేపించింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో టిమ్‌కుక్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్నారు. అయితే, ఆపిల్‌ సీఈఓ పేరును ట్రంప్‌ పలుమార్లు తప్పుగా సంబోధించారు. టిమ్‌ కుక్‌ బదులు.. ‘టిమ్‌ ఆపిల్‌’ అని పలికారు.గతంలో కూడా పలువురు సీఈవోలను ట్రంప్ తప్పుగా పలకడంపై మీడియాలో విమర్శలు వచ్చాయి. దిగ్గజ సీఈవోల పేర్లను కూడా ట్రంప్ గుర్తుపెట్టుకోరంటూ నెటిజన్లు విమర్శించారు. అయితే టిమ్ కుక్ యాపిల్ సంస్థ అధినేతగా ఎదగడాన్ని అభినందిస్తూ...టిమ్ ఆపిల్‌గా ట్రంప్ ఆయన్ను సంభోదించారని ఆయన మద్దతుదారులు వెనకేసుకొస్తున్నారు.

ట్విట్టర్ ప్రొఫైల్‌లో టిమ్ ఆపిల్‌గా మారిన టిమ్ కుక్ పేరు
అయితే టిమ్ కుక్ పాజిటివ్‌గా తీసుకున్నారు. ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో తన పేరులో కుక్‌ను తొలగించి యాపిల్‌ సింబల్ పెట్టుకున్నారు. టిమ్ కుక్ తన పేరును మార్చుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా లాఫింగ్ ఎమోషన్ ట్వీట్ చేశారు.

First published: March 8, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading