హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Launch Live: ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది... 5జీ లాంఛింగ్ సందర్భంగా ప్రధాని మోదీ

5G Launch Live: ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది... 5జీ లాంఛింగ్ సందర్భంగా ప్రధాని మోదీ

5G Launch Live: ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది... 5జీ లాంఛింగ్ సందర్భంగా ప్రధాని మోదీ

5G Launch Live: ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది... 5జీ లాంఛింగ్ సందర్భంగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (India Mobile Congress) 5జీ సేవల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని 5జీ సేవల లాంఛింగ్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (India Mobile Congress) 5జీ సేవల్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ అయిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన నరేంద్ర మోదీ... అదే వేదిక నుంచి 5జీ సేవల్ని ప్రారంభించారు. 5జీ సేవల కారణంగా గ్రామీణ పాఠశాలల పిల్లలు కూడా మనతో ఉన్నారని మోదీ అన్నారు.

గతంలో 2జీ, 3జీ, 4జీ సమయంలో భారతదేశం టెక్నాలజీ కోసం ఇతర దేశాలపై ఆధారపడిందని, ఇప్పుడు 5జీతో భారతదేశం కొత్త చరిత్ర సృష్టిస్తోందన్నారు. 5జీ నెట్వర్క్‌తో భారతదేశం మొదటిసారిగా టెలికాం టెక్నాలజీలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పుతోందన్నారు. టెక్నాలజీ ప్రజాస్వామ్యం చేయబడిందని, ఇప్పుడు టెక్నాలజీ మారుమూల గ్రామాలకు కూడా లభిస్తోందన్నారు. ఒకే క్లిక్‌తో వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలలో జమ అవుతున్నాయని, ఇది డిజిటల్ ఇండియా సత్తా అని అన్నారు.

5G Launch: 5జీ యుగంలోకి అడుగుపెట్టిన భారత్... 5జీ సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశంలో 8 ఏళ్ల క్రితం కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు ఉండేవని, ఇప్పుడు 200 యూనిట్లు ఉన్నాయన్నారు. గతంలో స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేసుకునేవారిమని, ఇప్పుడు ఇతర దేశాలకు ఇండియా నుంచి స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఇతర దేశాలకు మొబైల్స్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానమని మోదీ అన్నారు.

పిల్లలు ఆన్‌లైన్‌లో క్లాసులు వింటున్నారని, వైద్యులు పేషెంట్లకు టెలీమెడిసిన్ ద్వారా చికిత్స అందిస్తున్నారని, ఆఫీసులు మూసేసినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని, డిజిటల్ ఇండియా అందరికీ ఉపయోగపడుతుందన్నారు. చిన్నచిన్న వ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ స్వీకరిస్తున్నారని అన్నారు.

1G to 5G: ఇండియాలో 5G సేవలు ప్రారంభం... 1G నుంచి 5G వరకు టెక్నాలజీ జర్నీ ఇదే

ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300 ఉండేదని, ఇప్పుకు కేవలం రూ.10 కే 1జీబీ డేటా లభిస్తోందని అన్నారు. ఒక వ్యక్తి నెలకు 14జీబీ డేటా ఉపయోగిస్తున్నారని అన్నారు. 2014లో 14జీబీ డేటాకు రూ.4,200 చెల్లించాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు రూ.150 చెల్లిస్తే ఈ డేటా ఉపయోగించవచ్చని అన్నారు. ఒక కస్టమర్‌కు నెలకు రూ.4,000 ఆదా అవుతోందని అన్నారు. భారతదేశంలో డేటా చాలా చౌక అని అన్నారు. నెలకు రూ.4,000 ఆదా కావడం మామూలు విషయం కాదన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, 5g technology, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు