Cyber Attacks: ఇటీవల కాలంలో ఇండియాలో సైబర్ దాడులు(Cyber attacks) పెరిగాయి. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. 2021తో పోలిస్తే 2022లో గ్లోబల్ సైబర్ ఎటాక్స్(Global cyber attacks) 38 శాతం పెరిగాయి. ఇటీవల ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సర్వర్‌లపై రాన్సమ్‌వేర్(ransomware) దాడులు జరిగిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం భారతదేశం(India)లో జరిగిన అతిపెద్ద సైబర్ దాడిగా దీన్ని పేర్కొనవచ్చు. అయితే భారతదేశంలో హెల్త్‌కేర్ ఇండస్ట్రీ(Healthcare Industry) లక్ష్యంగా హ్యాకర్లు ఎక్కువగా దాడులు జరిగినట్లు ఓ నివేదిక పేర్కొంది.
2022లో అత్యధికంగా దాడికి గురైన పరిశ్రమల పరంగా హెల్త్‌కేర్, దాని తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో విద్య/పరిశోధన, ప్రభుత్వం/మిలిటరీ ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో గ్లోబల్ సైబర్‌టాక్స్ సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని నివేదికలు వెల్లడించాయి. ఒక్కో సంస్థపై సగటున వారానికి 1168 దాడులు జరిగాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ డివైజ్‌లు టార్గెట్
చెక్ పాయింట్ రీసెర్చ్ (CPR) రిపోర్ట్ ప్రకారం.. ఈ సైబర్ ఎటాక్స్ చిన్న, చురుకైన హ్యాకర్లు, రాన్సమ్‌వేర్ గ్యాంగ్‌ల ద్వారా జరిగాయి. సైబర్ నేరగాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉపయోగించే డివైజ్‌లపై దృష్టి సారించినట్లు నివేదిక పేర్కొంది. కోవిడ్-19 తర్వాత ఆన్‌లైన్ లెర్నింగ్‌కి మారిన విద్యా సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
టార్గెట్- హెల్త్‌కేర్ ఇండస్ట్రీ
చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్, డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ మాట్లాడుతూ.. హ్యాకర్లు ఆసుపత్రుల లక్ష్యంగా దాడులు జరపడానికి ఇష్టపడతారని చెప్పారు. వారు చిన్న ఆసుపత్రులతో సైబర్ సెక్యూరిటీ రిసోర్సెస్ తక్కువగా ఉంటాయని భావిస్తారని తెలిపారు. సైబర్ ఎటాక్‌లను అడ్డుకోవడానికి అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉండవని అనుకుంటారని పేర్కొన్నారు.
హెల్త్‌కేర్ రంగం హ్యాకర్లకు చాలా లాభదాయకంగా ఉంటుందన్నారు ఒమర్. ఎందుకంటే వారు హెల్త్ ఇన్సూరెన్స్ సమాచారం, మెడికల్ రికార్డ్స్ నంబర్‌లు, కొన్ని సందర్బాల్లో సోషల్ సెక్యూరటీ నంబర్‌లు పొందడం లక్ష్యంగా పెట్టుకుంటారని తెలిపారు. పేషెంట్ రికార్డులను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తామని బెదిరింపులకు పాల్పడి, రాన్సమ్‌వేర్ ముఠాలు నగదు డిమాండ్ చేస్తాయని ఒమర్ డెంబిన్స్కీ పేర్కొన్నారు.
Veer EV: ఇండియన్ ఆర్మీ కోసం స్టార్టప్ కంపెనీ స్పెషల్ వెహికల్..ప్రవైగ్ ‘వీర్ EV’ డిజైన్, ఫీచర్స్ ఇవే..
నవంబర్‌లో భారతదేశపు ప్రముఖ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థ రాన్సమ్‌వేర్ దాడి జరిగింది. ఈ ఎటాక్ చైనా నుంచి జరిగినట్లు గుర్తించారు. దీని గురించి ఇన్వెస్టిగేటింగ్ IT అధికారులు మాట్లాడుతూ.. AIIMS దాడి తర్వాత, మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు వంటి VIPలతో సహా కోట్లాది మంది రోగుల డేటా హ్యాకర్ల చేతికి చిక్కిందని అధికారులు భయపడ్డారు. అయితే డేటా డీక్రిప్ట్ అయిందని ఐటీ అధికారులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber Attack, Cyber crimes, Health care