హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone's bug: ఐఫోన్‌కు వైఫై కనెక్షన్‌ను ఆపేసే బగ్‌.. తాజాగా కనుగొన్న సెక్యూరిటీ రిసెర్చర్..

iPhone's bug: ఐఫోన్‌కు వైఫై కనెక్షన్‌ను ఆపేసే బగ్‌.. తాజాగా కనుగొన్న సెక్యూరిటీ రిసెర్చర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఫోన్‌లలో ఒక చిన్న బగ్‌ను గుర్తించారు కార్ల్ షౌ అనే ఒక సెక్యూరిటీ రిసెర్చర్. పర్సంటేజ్ సింబల్ ఉన్న వైఫై నెట్‌వర్క్‌కు ఐఫోన్‌లు కనెక్ట్ కావట్లేదని ఆయన ట్వీట్ చేశారు. దీని వల్ల ఐఓఎస్ డివైజ్‌లలో వైఫై కనెక్టివిటీ శాశ్వతంగా డిసేబుల్ అవుతుందని షౌ వెల్లడించారు.

ఇంకా చదవండి ...

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కొనాలనుకునే వారు.. ముందు బ్రాండ్‌ గురించి ఆరా తీస్తారు. సాధారణంగా కస్టమర్లు బ్రాండ్‌ ఆధారంగానే వాటి పనితీరును అంచనా వేస్తుంటారు. మనకు తెలిసినంత వరకు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్‌కు మంచి ఆదరణ ఉంటుంది. సంస్థ నుంచి వచ్చిన ఐఫోన్ సిరీస్‌లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఐఫోన్‌లలో ఒక చిన్న బగ్‌ను గుర్తించారు కార్ల్ షౌ అనే ఒక సెక్యూరిటీ రిసెర్చర్. పర్సంటేజ్ సింబల్ ఉన్న వైఫై నెట్‌వర్క్‌కు ఐఫోన్‌లు కనెక్ట్ కావట్లేదని ఆయన ట్వీట్ చేశారు. దీని వల్ల ఐఓఎస్ డివైజ్‌లలో వైఫై కనెక్టివిటీ శాశ్వతంగా డిసేబుల్ అవుతుందని షౌ వెల్లడించారు.

ట్వీట్‌లో ఏముందంటే..

%secretclub%power అనే పేరుతో ఉన్న వైఫై నెట్‌వర్క్‌ (SSID)లకు ఐఫోన్‌ను కనెక్ట్ చేసేటప్పుడు.. వైఫై ఫంక్షన్లు ఆటోమెటిగ్గా డిసేబుల్ అవుతున్నాయని కార్ల్ షౌ తెలిపారు. పర్సంటేజ్ గుర్తు (%) ఉన్న కొన్ని వై-ఫై నెట్‌వర్క్‌లు.. ఐఫోన్‌లు, ఇతర iOS డివైజ్‌లో వై-ఫై కనెక్టివిటీని నిలిపివేయవచ్చని ఆయన కనుగొన్నారు. వైఫై హాట్‌స్పాట్‌కు '%p%s%s%s%s%n' అనే పేరు పెట్టుకుంటే.. ఐఓఎస్ డివైజ్‌లు ఆ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. లేదంటే ఎయిర్ డ్రాప్ వంటి సిస్టమ్ నెట్‌వర్కింగ్ ఫీచర్లు పనిచేయట్లేదని షౌ అంతకు ముందు కనుగొన్నారు.

https://twitter.com/vm_call/status/1405937492642123782?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1405937492642123782%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.moneycontrol.com%2Fnews%2Ftechnology%2Fa-security-flaw-on-the-iphones-can-disable-wi-fi-networking-on-the-devices-7125921.html

ఈ సమస్యను గుర్తించిన డివైజ్‌ను రీబూట్ చేసిన తరువాత కూడా సమస్యలు కొనసాగుతున్నట్లు కార్ల్ షౌ గుర్తించారు. సాధారణంగా పర్సంటేజ్ గుర్తును ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వాడతారు. వేరియబుల్స్‌ను అవుట్‌పుట్ స్ట్రింగ్‌లోకి ఫార్మాట్ చేయడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. అందువల్ల దీన్ని వైఫై నెట్‌వర్క్ నేమ్ (SSID)లో యాడ్ చేస్తే సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఒకటి వైఫై సెట్టింగ్స్‌ను రీసెట్ చేసుకోవడం. రెండోది ఐక్లౌడ్ నుంచి వైఫై నెట్‌వర్క్ పేరును తొలగించడం. ఈ బగ్‌ను పరిష్కరించే విషయంపై యాపిల్ సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.


ఇది చూడండి...


ఇది చూడండి..

First published:

Tags: Apple, Iphone

ఉత్తమ కథలు