మెసేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసే మొబైల్ కీబోర్డ్!

మీరు మీ భాషలో టైప్ చేస్తే... మీరు ఎంపిక చేసిన భాషలోకి మెసేజ్ ట్రాన్స్‌లేట్ అవుతుంది. అంతేకాదు... అవతలివాళ్లు వాళ్ల భాషలో రిప్లై ఇచ్చినా... ఆ మెసేజ్ మీ భాషలోనే కనిపిస్తుంది.

news18-telugu
Updated: October 2, 2018, 10:26 AM IST
మెసేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసే మొబైల్ కీబోర్డ్!
మీరు మీ భాషలో టైప్ చేస్తే... మీరు ఎంపిక చేసిన భాషలోకి మెసేజ్ ట్రాన్స్‌లేట్ అవుతుంది. అంతేకాదు... అవతలివాళ్లు వాళ్ల భాషలో రిప్లై ఇచ్చినా... ఆ మెసేజ్ మీ భాషలోనే కనిపిస్తుంది.
  • Share this:
చాలావరకు ఆండ్రాయిడ్ ఫోన్లల్లో స్విఫ్ట్‌కీ పేరుతో కీబోర్డ్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ కీబోర్డ్‌తో మీరు టైప్‌ చేసే మెసేజ్‌ని 60 భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. 'స్విఫ్ట్‌కీ'లోకి ట్రాన్స్‌లేటర్‌ని అనుసంధానం చేసింది మైక్రోసాఫ్ట్. దీని వల్ల మీ స్నేహితులు, పరిచయస్తులతో భాషా సమస్య రానేరాదు. మీరు మీ భాషలో మెసేజ్ టైప్ చేసినా సరే... అవతలివాళ్లకు వాళ్ల భాషలో మెసేజ్ వెళ్తుంది.

ఇంతకముందంటే... గూగుల్ ట్రాన్స్‌లేట్‌లోకి వెళ్లి అనువాదం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. 'స్విఫ్ట్‌కీ' కీబోర్డ్‌తో లైవ్‌లోనే అనువాదం చేయొచ్చు. ఇలా 60 భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసే అవకాశముంది.


'స్విఫ్ట్‌కీ' ఎలా ఉపయోగించాలి?
ముందుగా మీరు 'స్విఫ్ట్‌కీ' యాప్ డౌన్‌లోడ్ చేయాలి.


ఆ తర్వాత మెసేజ్ పంపేందుకు విండో(ఇమెయిల్, టెక్స్ట్, మెసెంజర్ లాంటివి) ఓపెన్ చేయాలి.
మెనూలో ట్రాన్స్‌లేటర్ ఐకాన్‌పై క్లిక్ చేసి భాషను ఎంచుకోవాలి.మీరు మీ భాషలో టైప్ చేస్తే... మీరు ఎంపిక చేసిన భాషలోకి మెసేజ్ ట్రాన్స్‌లేట్ అవుతుంది.
అంతేకాదు... అవతలివాళ్లు వాళ్ల భాషలో రిప్లై ఇచ్చినా... ఆ మెసేజ్ మీ భాషలోనే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?
First published: October 2, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు