ఇండియన్ మార్కెట్లో షియోమి బ్రాండ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. చైనాకు చెందిన ఈ కంపెనీ భారతదేశంలో మంచి మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికి షియోమి కంపెనీకి చెందిన రెడ్మీ సిరీస్ లాంచ్ అయి 8 వసంతాలు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రెండు రెడ్మీ మోడల్స్‌పై కంపెనీ ధరలను తగ్గించింది. ఇప్పుడు రెడ్మీ నోట్ 11(Redmi Note 11), రెడ్మీ నోట్ 11S (Redmi Note 11S) వేరియంట్లను తక్కువ ధరకు వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. రెడ్మీ నోట్ 11 బేస్ వేరియంట్ (44GB +64GB) రూ.13,499తో లాంచ్ కాగా, ప్రస్తుతం రూ.12,999కు లభిస్తుంది. రెడ్మీ నోట్ 11S బేస్ వేరియంట్ రూ.16,499తో లాంచ్ కాగా, ప్రస్తుతం రూ.15,999కు అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11S మోడల్స్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వేరియంట్‌పై ధర తగ్గింది. ఈ స్మార్ట్ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, కంపెనీ అధికార వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.
రెడ్ మీ నోట్ 11S..
రెడ్మీ నోట్ 11S మోడల్ బేస్ వేరియంట్ (6GB+64GB) ధరపై రూ.500 తగ్గింది. దీంతో ఇది ప్రస్తుతం రూ.15,999కు లభిస్తుంది. ఈ మోడల్‌కు చెందిన 6GB+128GB వేరియంట్ ధర రూ.1500 తగ్గింది. ఇప్పుడు ఇది రూ.15,999కు లభిస్తుంది. ఈ మోడల్‌కు చెందిన ప్రీమియం వేరియంట్ (8GB+128GB) ధర రూ.1500 తగ్గి, రూ.16,999కు అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇది MediaTek Helio G96 ఆక్టా-కోర్ చిప్సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లో f/1.9 ఎపర్చరుతో 108MP మెయిన్ సెన్సార్+ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా+ 2MP డెప్త్ +2MP మాక్రో కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంటుంది.
రెడ్మీ నోట్ 11..
రెడ్మీ నోట్ 11(4GB+64GB) వేరియంట్‌పై రూ.500 ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇది రూ.12,999కు లభిస్తుంది. ఈ మోడల్ కు చెందిన 6GB+64GB వేరియంట్‌పై కూడా రూ.500 ధర తగ్గింది. ఈ మోడల్‌ను ఇప్పుడు రూ.13,499కు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం వేరియంట్ 6GB+128GBపై కూడా రూ.500 ధర తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ.14,499కు అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్..
రెడ్మీ నోట్ 11 అనేది 4జీ స్మార్ట్‌ఫోన్, 6.43-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో లభిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియర్ 50MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హారిజోన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్బర్స్ట్ వైట్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Mobile offers, Redmi, Smartphones