హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp, Instagram: వాట్సాప్‌, ఇన్‌స్టాలో డిలీటెడ్‌ మెసేజెస్‌ చూడాలా? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయిపోండి

WhatsApp, Instagram: వాట్సాప్‌, ఇన్‌స్టాలో డిలీటెడ్‌ మెసేజెస్‌ చూడాలా? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయిపోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp, Instagram: మెసేజ్‌ సెండ్‌ చేసిన తర్వాత పొరపాట్లు గుర్తించినా, ఒకరికి సెండ్‌ చేయబోయి మరొకరికి సెండ్‌ చేసినా వెంటనే డిలీట్‌ చేయవచ్చు. మరో కోణంలో చూస్తే.. ఎవరైనా మెసేజ్‌ చేసి డిలీట్‌ చేస్తే? అవతల వ్యక్తులు ఆ మెసేజ్‌ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంతకు ముందు మెసేజింగ్‌ అప్లికేషన్స్‌ లేదా సోషల్‌ మీడియా (Social Media) యాప్‌లలో మెసేజ్‌ సెండ్‌ చేసిన తర్వాత, అందులో ఏవైనా లోపాలను గుర్తిస్తే చేయగలిగింది ఏమీ లేదు. ఆ తర్వాత ఈ సమస్యకు చెక్‌ పెడుతూ డిలీట్‌, అన్‌సెండ్‌ ఫీచర్లు వచ్చాయి. మెసేజ్‌ సెండ్‌ చేసిన తర్వాత పొరపాట్లు గుర్తించినా, ఒకరికి సెండ్‌ చేయబోయి మరొకరికి సెండ్‌ చేసినా వెంటనే డిలీట్‌ చేయవచ్చు. మరో కోణంలో చూస్తే.. ఎవరైనా మెసేజ్‌ చేసి డిలీట్‌ చేస్తే? అవతల వ్యక్తులు ఆ మెసేజ్‌ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ యూజర్‌ అయితే డిలీటెడ్‌ మెసేజ్‌ల కంటెంట్‌ ఏంటో తెలుసుకునే రెండు మార్గాలు ఉన్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

* నోటిఫికేషన్ హిస్టరీ

గూగుల్‌ స్వయంగా ఆండ్రాయిడ్‌లో విలీనం చేసిన ఓ ఫీచర్‌ ద్వారా డిలీటెడ్‌ మెసేజెస్‌ తెలుసుకోవచ్చు. తొలగించిన(డిస్‌మిస్డ్‌) రీసెంట్‌ నోటిఫికేషన్‌లు నోటిఫికేషన్ హిస్టరీలో స్టోర్‌ అయి ఉంటాయి. ఏదైనా మెసేజ్‌ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు పక్కకు స్వైప్‌ చేసేస్తే అది నోటిఫికేషన్ హిస్టరీ ట్యాబ్‌లోకి వెళ్తుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీటెడ్‌, అన్‌సెంట్‌ మెసేజ్‌లు డిస్‌మిస్డ్‌ మెసేజ్‌ల తరహాలోనే ప్రవర్తిస్తాయి. దీనర్థం అవి కూడా నోటిఫికేషన్ హిస్టరీ ట్యాబ్‌కు చేరుతాయి. ఈ సెక్షన్‌లో ఆ మెసేజ్‌లను చూడవచ్చు. దాదాపు అన్ని ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్లే ఆప్షన్లు ఒకేలా ఉంటాయి.

ముందుగా సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి, నోటిఫికేషన్స్‌కి వెళ్లాలి. ఆ తర్వాత అందులో నోటిఫికేషన్స్‌ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత నోటిఫికేషన్ హిస్టరీని ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చూడవచ్చు. డిలీటెడ్‌ మెసేజ్‌లు ఈ ట్యాబ్‌లో 24 గంటలు మాత్రమే ఉంటాయని గుర్తించాలి. ఆ తర్వాత అవి శాశ్వతంగా డిలీట్‌ అయిపోతాయి.

ఇది కూడా చదవండి : ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింక్స్ పై క్లిక్ చేస్తే మీ డబ్బు గోవిందా గోవిందా!

* WAMR ఉపయోగించి

నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. అయితే అన్ని ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో ఉండకపోవచ్చు. భారతదేశంలో షియోమి కంపెనీ కొన్ని కారణాల వల్ల దాని MIUI స్కిన్‌ ఫీచర్‌ను నిలిపివేసింది. అయితే షియోమి యూజర్‌లకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కాకుండా, ప్రతి చాట్ యాప్‌లో డిలీటెడ్‌ మెసేజ్‌లను రికవర్‌ చేయడానికి WAMR టూల్‌ ఉపయోగపడుతుంది. శాశ్వతంగా మెసేజెస్‌ను స్టోర్‌ చేస్తుంది.

ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌(Google Play Store) నుంచి WAMRని డౌన్‌లోడ్ చేయండి. యాప్‌ని ఓపెన్‌ చేసి నోటిఫికేషన్ యాక్సెస్ వంటి అవసరమైన అనుమతులను ఎనేబుల్ చేయండి. లాగ్‌లను సేవ్ చేయాలనుకుంటున్న యాప్‌లను సెలక్ట్‌ చేసుకోండి.సెటప్ పూర్తయిన తర్వాత, డిలీటెడ్‌ మెసేజెస్‌ కనిపించే సెక్షన్‌కి వెళ్తారు.

యాప్‌ల మధ్య మారడానికి ఎగువ ఎడమ వైపున ఉన్న హాంబర్గర్ మెనుపై క్లిక్‌ చేయాలి.

యాప్‌కి నోటిఫికేషన్ యాక్సెస్‌ను మంజూరు చేయడం వలన అన్ని నోటిఫికేషన్‌లను చూడవచ్చని గుర్తుంచుకోండి. ఇందులో కాంటాక్ట్స్‌, మెసేజ్‌లు, ఫోటోలు వంటి వ్యక్తిగత సమాచారం ఉండవచ్చు. చాలా మంది యూజర్లు ఈ యాప్‌కు పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చారు. సురక్షితమైందని తెలిపారు.

First published:

Tags: Instagram, Tech news, Whatsapp

ఉత్తమ కథలు