Iphone: ఐఫోన్ స్లో అవుతుందా.. ఇలా చేస్తే మీ ఫోన్ సూపర్ ఫాస్ట్ అవుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా కొన్న స్మార్ట్ ఫోన్స్ తొలి రోజుల్లో చాలా వేగంగా పనిచేస్తాయి. కాలక్రమేణా వాటి పనితీరు నెమ్మదిస్తుంది. ఇందుకు ఐఫోన్‌లు మినహాయింపేమి కాదు. యూజర్లకు స్మూత్ ఇంటర్‌ఫేస్‌, ఫాస్ట్ పర్ఫామెన్స్ అందిస్తూ అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లుగా యాపిల్ ఫోన్స్ పేరు తెచ్చుకున్నాయి. కానీ ఐఫోన్‌లు పాతవి అవుతున్నకొద్దీ.. వాటి ఇంటర్‌ఫేస్‌ లో ల్యాగ్స్ కనిపిస్తున్నాయి.

  • Share this:
కొత్తగా కొన్న స్మార్ట్ ఫోన్స్ తొలి రోజుల్లో చాలా వేగంగా పనిచేస్తాయి. కాలక్రమేణా వాటి పనితీరు నెమ్మదిస్తుంది. ఇందుకు ఐఫోన్‌లు మినహాయింపేమి కాదు. యూజర్లకు స్మూత్ ఇంటర్‌ఫేస్‌, ఫాస్ట్ పర్ఫామెన్స్ అందిస్తూ అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లుగా యాపిల్ ఫోన్స్ పేరు తెచ్చుకున్నాయి. కానీ ఐఫోన్‌లు పాతవి అవుతున్నకొద్దీ.. వాటి ఇంటర్‌ఫేస్‌ లో ల్యాగ్స్ కనిపిస్తున్నాయి. కాలంతో పాటు ఐఫోన్‌లలో సేవ్డ్ డేటా పెరుగుతుంది. దానికి టెంపరరీ డేటా తోడై ఐఫోన్ పర్ఫామెన్స్‌పై భారంగా మారుతుంది. ఫలితంగా ఐఫోన్ తొలిరోజుల్లో మాదిరిగా వేగంగా పని చేయట్లేదు అనిపిస్తుంది.

ఇక సిరి వాయిస్ ఫైల్స్ వంటి ఇతర స్టోరేజ్ ఫైల్స్ కూడా ఐఫోన్ ఫాస్ట్ పర్ఫామెన్స్ కి అడ్డు పడుతుంటాయి. ఫోన్ స్లో కావడానికి ప్రధాన కారణం క్యాష్(Cache) అని కూడా టెక్ నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ స్టోరేజ్ డేటాను తొలగించి ఫోన్ పర్ఫామెన్స్ ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం, పదండి.

ఐఫోన్‌లలో ఇతర స్టోరేజ్‌ని ఎలా డిలీట్ చేయాలి:

ముందు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. జనరల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఫోన్ లోని మొత్తం స్టోరేజ్ సెపరేట్ సెక్షన్లలో కనిపిస్తుంది. తరువాత అవసరంలేని స్టోరేజ్ ను డిలీట్ చేసుకోవచ్చు. ఎప్పుడూ యూజ్ చేయని అప్లికేషన్ల స్టోరేజ్ డిలీట్ చేయాలనుకుంటే.. వాటిపై క్లిక్ చేసి ఆఫ్ లోడ్(Offload) చేయండి. ఇలా చేయడం వల్ల ఆ అప్లికేషన్లు ఫోన్ నుంచి రిమూవ్ అవుతాయి. అవసరం వచ్చినప్పుడు వాటిని మళ్ళీ మనం ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

మెసేజ్ లు డిలీట్ చేయకపోవడం వల్ల అవన్నీ కుప్పలా పేరుకుపోయి ఫోన్ పర్ఫామెన్స్ ని తగ్గిస్తాయి. అందుకే అవసరం లేని మెసేజ్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి. అలాగే ఫోన్ కాల్ హిస్టరీ అప్పుడప్పుడు డిలీట్ చేస్తూ ఉండండి.

ఇది కూడా చదవండి: OnePlus: పేలిన వన్‌ప్లస్ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్.. కస్టమర్‌కు భారీ షాక్ ఇచ్చిన కంపెనీ

మనం ప్రతిరోజూ బ్రౌజర్ లలో ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఓపెన్ చేస్తున్న ప్రతి వెబ్ పేజీ కోసం బ్రౌజర్ కొంత క్యాష్ స్టోర్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెబ్ పేజ్ కోసం 10-100MB వరకు స్టోర్ చేస్తుంది. మళ్లీ అదే వెబ్ సైట్స్ ఓపెన్ చేసినప్పుడు వేగంగా లోడ్ అవ్వాలని ఇలా స్టోర్ చేస్తుంది. క్యాష్ డిలీట్ చేయాలనుకుంటే సఫారీ బ్రౌజర్లో క్లియర్ హిస్టరీ పై క్లిక్ చేయండి. వెబ్సైట్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేసే అవసరం లేని డేటా క్లియర్ చేయండి.

బ్రౌజర్ మాత్రమే కాదు తరచూ వినియోగించే గూగుల్ మ్యాప్స్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అప్లికేషన్లు కూడా చాలా క్యాచీ డేటాను కలెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ పెరిగిపోయి పర్ఫామెన్స్ పై భారం పడుతుంది. అప్పుడప్పుడు ఈ అప్లికేషన్ల క్యాచీ కూడా డిలీట్ చేస్తూ ఉండండి. పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తే మీ ఫోన్ పర్ఫామెన్స్ మెరుగుపడుతుంది.
Published by:Sambasiva Reddy
First published: