హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones: కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా?.. అయితే డిసెంబర్​లో లాంచ్​ అవుతున్న ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి

Smartphones: కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా?.. అయితే డిసెంబర్​లో లాంచ్​ అవుతున్న ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి

డిసెంబర్‌లో లాంచ్ కాబోతున్న కొత్త ఫోన్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

డిసెంబర్‌లో లాంచ్ కాబోతున్న కొత్త ఫోన్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

వచ్చే జనవరి నుంచి స్మార్ట్​ఫోన్​ ధరలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఫోన్​ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. దీనికి తోడు డిసెంబర్​లో అనేక కొత్త స్మార్ట్​ఫోన్లు లాంచ్​ అవుతున్నాయి. డిసెంబర్​లో మీరు కొనగలిగే టాప్​ స్మార్ట్​ఫోన్లను పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...

భారత స్మార్ట్​ఫోన్ (Smart Phone)​ మార్కెట్​ వేగంగా విస్తరిస్తోంది. కరోనా (Corona) తర్వాత స్మార్ట్​ఫోన్ల విక్రయాలు మరింత జోరందుకున్నాయి. దీన్ని క్యాష్​ చేసుకునేందుకు అన్ని మొబైల్​ తయారీ సంస్థలు వరుసగా స్మార్ట్​ఫోన్లను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం 2021 చివర్లో ఉన్నాం. వచ్చే జనవరి నుంచి స్మార్ట్​ఫోన్​ ధరలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఫోన్​ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. దీనికి తోడు డిసెంబర్​లో అనేక కొత్త స్మార్ట్​ఫోన్లు లాంచ్​ అవుతున్నాయి. వన్​ప్లస్​ (One Plus), మెటరోలా (Motarola), షియోమి (Xiaomi) కొత్త సిరీస్​ ఇలా అనేక ఫోన్లు మార్కెట్​లో అలరించనున్నాయి. డిసెంబర్​లో మీరు కొనగలిగే టాప్​ స్మార్ట్​ఫోన్లను పరిశీలిద్దాం.

రెడ్​మీ నోట్​ 11టీ 5జీ

రెడ్​మీ నోట్​ 11టీ 5జీ స్మార్ట్​ఫోన్​ అధికారికంగా నవంబర్ 30 న చైనాలో ప్రారంభంకానుంది. అయితే, ఇది డిసెంబర్‌లో భారత మార్కెట్​లోకి రానుంది. ఈ ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయిన రెడ్​మీ నోట్​ 11 5Gకి రీబ్రాండెడ్ వెర్షన్. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్​6nm ఆధారిత మీడియాటెక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

షియోమి12

చైనా స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ షియోమి నెక్స్ట్ జనరేషన్​ సిరీస్ షియోమి 12 డిసెంబర్ 12న చైనాలో లాంచ్ అవ్వనుంది. అయితే, భారత మార్కెట్​లోకి మాత్రం 2022లో వచ్చే అవకాశం ఉంది. లీక్‌లను బట్టి చూస్తే.. ఈ ఫోన్ క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 SoC (లేదా స్నాప్‌డ్రాగన్ 898 SoC) ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీని వెనుకవైపు 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనుంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Realme Smart TV: రియల్‌మీ బంపరాఫర్.. రూ. 15,999కే స్మార్ట్ టీవీ.. ఆఫర్ మరికొన్ని గంటలే..


వన్​ప్లస్​ 9 ఆర్​టీ

ఇటీవల చైనాలో ప్రారంభమైన వన్​ప్లస్​ 9RT డిసెంబర్​లో భారత మార్కెట్‌లలోకి రానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. దీనిలో 50- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ వంటి కీలక ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

మోటో జీ 200

మోటో జీ200 డిసెంబర్​లో భారత మార్కెట్​లోకి రానుంది. ఇది ఇప్పటికే యూకే మార్కెట్లోకి రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ పవర్డ్​ ప్రాసెసర్​పై పనిచేస్తుంది. మోటో జీ200 స్మార్ట్​ఫోన్​ 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీ యూనిట్ గల 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.

Cyber Security: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా.. ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి


మోటో G51 5G

మోటో జీ51 5జీ స్మార్ట్​ఫోన్​ డిసెంబర్​లో భారత మార్కెట్​లోకి రానుంది. ఇది ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లోకి రిలీజైంది. పుకార్లు నిజమైతే.. దేశంలోనే మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 480+ అమర్చబడిన స్మార్ట్‌ఫోన్ అవుతుంది. అంతేకాదు, మోటో జీ సిరీస్​లో రూ. 20 వేలలోపు లభించే మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా అవుతుంది. ఇది 6.8 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే, 50 -మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ప్రో

మైక్రోమ్యాక్స్ కూడా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. మైక్రోమాక్స్​ ఇన్​ నోట్ 1 ప్రో పేరిట ఇది ప్రారంభంకానుంది. ఇది మీడియాటెక్​ హీలియో G90 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్​తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 అవుట్ ది బాక్స్‌ ఓఎస్​పై రన్ అవుతుంది.

Published by:John Kora
First published:

Tags: Motorola, ONE PLUS, Smart phone, Xiaomi

ఉత్తమ కథలు