• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • THESE SMART TOILETS CALCULATES YOUR FATIGUE LEVELS WHICH WERE INSTALLED ON ROADSIDE IN JAPAN SK GH

Hitech Toilets: హైటెక్ టాయిలెట్స్.. మీరు ఎంతగా అలసిపోయారో ఇట్టే చెప్పేస్తాయి..

Hitech Toilets: హైటెక్ టాయిలెట్స్.. మీరు ఎంతగా అలసిపోయారో ఇట్టే చెప్పేస్తాయి..

ప్రతీకాత్మక చిత్రం

ఎవరైనా అలసిపోయినప్పుడు సింపథెటిక్ నాడీ వ్యవస్థలోని ఉద్రిక్తతలు పెరగడంతో పాటు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ కార్యకలాపాలు తగ్గిపోతాయి. ఈ వివరాలను టాయిలెట్ సిస్టమ్ గుర్తిస్తుంది.

  • Share this:
టెక్నాలజీ మనుషుల అవసరాలను సులభతరం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన కొన్ని ఆవిష్కరణలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. మరికొన్ని మాత్రం వింతగా కనిపిస్తాయి. జపాన్‌లో ఏర్పాటు చేసిన ఒక స్మార్ట్ టాయిలెట్ ఈ విభాగంలోకే వస్తోంది. దీన్ని అలసట స్థాయులను గుర్తించేందుకు రూపొందించారు. ఈ వింత పబ్లిక్ టాయిలెట్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దేశంలోని కనగావా ప్రిఫెక్చర్ ఎబినా సర్వీస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టాయిలెట్ వ్యక్తుల అలసట స్థాయిని కొలవడానికి సహాయపడుతుంది. టోక్యో నుంచి 45 నిమిషాల్లో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ పబ్లిక్ టాయిలెట్ ద్వారా వెళ్లే డ్రైవర్లు స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులో ఆహారం తిని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. దీంతో పాటు అలసట స్థాయులను కూడా తెలుసుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?
ఈ స్మార్ట్ టాయిలెట్ సిస్టమ్ కోసం టచ్ స్క్రీన్ టెక్నాలజీని వాడారు. అలసటను గుర్తించే టాయిలెట్ బేషిన్ లేదా బిడెట్‌కు టచ్ స్క్రీన్ బటన్లను, సెన్సార్లను ఏర్పాటు చేశారు. యూజర్లు ముందు తమకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత సిస్టమ్ అడిగే వివరాలను నమోదు చేయాలి. ముందు యూజర్లు తమ వయసును నమోదు చేయాలి. వారు అలసిపోయినట్లుగా భావిస్తున్నారా లేదా అనే వివరాలను సిస్టమ్‌లో ఎంటర్ చేయాలి. అనంతరం టాయిలెట్‌ను వాడినప్పుడు.. స్మార్ట్ సిస్టమ్ సెన్సార్ల ద్వారా వ్యక్తుల అలసట స్థాయిలను కొలుస్తుంది. ఈ వివరాలను నమోదు చేసి, యూజర్లకు చూపించడానికి ఒక నిమిషం సమయం పడుతుంది. అలసటను లెక్కించడానికి పల్స్ రేటులో మార్పులను గుర్తించే వైబ్రేషన్ సెన్సార్లను వాడారు. టాయిలెట్ గుర్తించిన వివరాలను మెసేజ్ ద్వారా చూపిస్తుంది.

నాడీ వ్యవస్థ పనితీరు ద్వారా..
ఎవరైనా అలసిపోయినప్పుడు సింపథెటిక్ నాడీ వ్యవస్థలోని ఉద్రిక్తతలు పెరగడంతో పాటు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ కార్యకలాపాలు తగ్గిపోతాయి. ఈ వివరాలను టాయిలెట్ సిస్టమ్ గుర్తిస్తుంది. టాయిలెట్‌లో ఏర్పాటు చేసిన సెన్సార్లు అలసట స్థాయిలను విశ్లేషించడానికి పల్స్ రీడింగ్‌ను, పల్స్ హెచ్చుతగ్గులను గుర్తిస్తాయి. ఒకసారి టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత వ్యక్తులు అలసిపోయారా, బాగా అలసిపోయారా లేదా ఏమాత్రం అలసిపోలేదా అనే స్థాయులను చూపిస్తుంది. తద్వారా దీన్ని ఉపయోగించిన వారు తమ అలసట స్థాయులు తెలుసుకోవచ్చు.



 



Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు