THESE MISTAKES IN WHATSAPP GROUPS MAY LAND ADMIN INTO JAIL KNOW WHY SS
WhatsApp: గ్రూప్‌లో ఈ తప్పులు చేస్తే వాట్సప్ అడ్మిన్ జైలుకే...
WhatsApp: గ్రూప్‌లో ఈ తప్పులు చేస్తే వాట్సప్ అడ్మిన్ జైలుకే...
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Rules | మీరు ఏదైనా వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? లేదా మీరు అడ్మిన్‌గా వాట్సప్ గ్రూప్ (WhatsApp Group) క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే అలర్ట్. గ్రూప్‌లో ఎవరు ఏ తప్పు చేసినా గ్రూప్ అడ్మిన్ జైలుకు వెళ్లే పరిస్థితి రావొచ్చు.
మీ వాట్సప్ గ్రూప్‌లో జరిగే తప్పులకు మీరు బాధ్యత వహించి రావొచ్చు. జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉంది. వాట్సప్‌లో గ్రూప్స్ (WhatsApp Groups) ఫీచర్ వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. లేదా గ్రూప్స్‌లో చేరుతున్నారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వాట్సప్ అందించిన ఫీచర్స్‌లో (WhatsApp Features) గ్రూప్స్ బాగా పాపులర్ అయిపోయింది. అయితే వాట్సప్ గ్రూప్స్‌తో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఎవరిని పడితే వారిని యాడ్ చేయడం, అవతలివారి అనుమతి తీసుకోకుండా గ్రూప్‌లో చేర్చడం, గ్రూప్‌లో ఉన్న సభ్యులు ప్రవర్తించే తీరు... ఇలా చాలా చిక్కులు ఉన్నాయి. ఈ చిక్కులన్నీ చివరకు గ్రూప్ అడ్మిన్ మెడకు చుట్టుకుంటాయి. వాట్సప్ గ్రూప్‌లో సభ్యులు చేసే తప్పులకు అడ్మిన్ బాధ్యత వహించడం మాత్రమే కాదు... జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా రావొచ్చు. వాట్సప్ గ్రూప్‌లో ఈ తప్పులు జరిగితే వాట్సప్ అడ్మిన్ జైలుకు వెళ్లడం ఖాయం.
వాట్సప్ గ్రూప్‌లో దేశ వ్యతిరేక సందేశాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేయకూడదు. గ్రూప్‌లో ఇలాంటివి షేర్ చేస్తే షేర్ చేసినవారితో పాటు గ్రూప్ అడ్మిన్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటనలో 'యాంటీ నేషనల్' మెసేజెస్ షేర్ చేసినందుకు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్ట్ చేశారు.
వాట్సప్‌లో సొంత ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం అలవాటే. వాట్సప్‌లో ఇతరుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం కూడా తప్పే. దీనిపైనా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే హింసను రెచ్చగొట్టే మెసేజెస్ పంపొద్దు. వీడియోలు, ఫోటోలు షేర్ చేయకూడదు. ఎవరి విశ్వాసాలను అవమానించకూడదు.
వాట్సప్ గ్రూప్స్‌లో పోర్న్ వీడియోలు షేర్ చేయడం కూడా తప్పు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు షేర్ చేసినా, అలాంటి కంటెంట్ ఏదైనా పోస్ట్ చేసినా జైలుకు వెళ్లడం ఖాయం. ఇక వాట్సప్‌లో ఫేక్ న్యూస్ సమస్య ఎప్పుడూ ఉండేదే. ప్రభుత్వం నిషేధించిన ఫేక్ న్యూస్, ఫేక్ కంటెంట్ సర్క్యులేట్ చేస్తే ఇబ్బందులు తప్పవు.
ఇవే కాకుండా వాట్సప్ యాప్ ఉపయోగించడానికి అనేక నియమనిబంధనలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వాట్సప్ ఉపయోగించాలి. వాట్సప్ గ్రూప్ మెయింటైన్ చేయాలి. యూజర్లు వాట్సప్‌ని ఎలా వాడుతున్నారో నిత్యం పరిశీలిస్తుంటుంది వాట్సప్. ఎక్కడైనా తేడా కనిపిస్తే ఆ అకౌంట్‌ను బ్లాక్ చేస్తూ ఉంటుంది. ప్రతీ నెలా 20 లక్షలకు పైనే వాట్సప్ అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి. కాబట్టి వాట్సప్ ఉపయోగించేప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.