రోబోలు ఈ ఉద్యోగాలను ఎప్పటికీ చేయలేవు.. అవేంటంటే..

2030 కల్లా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 46 దేశాల్లో నిర్వహించిన ఆ సర్వేలో మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది.

news18-telugu
Updated: May 8, 2019, 1:04 PM IST
రోబోలు ఈ ఉద్యోగాలను ఎప్పటికీ చేయలేవు.. అవేంటంటే..
రోబో
  • Share this:
కంప్యూటర్లు, రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో చేరిపోయాయి. కాదు.. కాదు.. జీవితాలను ముంచేస్తున్నాయి. మన ఉద్యోగాలకు ఎసరు పెడుతూ మనలను రోడ్డుకు ఈడుస్తున్నాయి. 19వ శతాబ్దం నుంచే యంత్రాలు కార్మికుల ఉద్యోగాలను కొల్లగొడుతూ వస్తున్నాయి. కంప్యూటర్, రోబో టెక్నాలజీతో ఈ ముప్పు మరింత ఎక్కువైంది. చాలా సంస్థలు మెషిన్ల ఆపరేషన్ కోసం ఇప్పటికే రోబోలను రంగంలోకి దించాయి. సైబర్ సిటీ అనలిస్ట్, డాటా డికెక్టివ్, పర్సనల్ డేటా బ్రోకర్, ఫిట్‌నెస్ కమిట్‌మెంట్ కౌన్సిలర్, పర్సనల్ మొమరీ క్యూరేటర్, చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్, ఫైనాన్షియల్ వెల్‌నెస్ కోచ్.. ఇలా 2030 కల్లా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 46 దేశాల్లో నిర్వహించిన ఆ సర్వేలో మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దాని వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు హాంఫట్ అంటాయట. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా, అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.

robots,jobs,robotics,robots taking jobs,robot jobs,no robot will be able to replace these people,robot will be able to,10 jobs robots will never replace,robots will take over these jobs,robot,robots taking over the world,robots taking over jobs,robot technology,robots will replaces these jobs,jobs robots will take over,jobs robots will take,what jobs will be killed by automation,justice,songs,games,tunes,paintings,advanced technology,రోబోలు, ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలను రోబోలు భర్తీ చేయలేవు, డాక్టర్లు, నర్సులు,పాటలు, ట్యూన్లు,పెయింటింగ్‌లు,ఆటలు,న్యాయం
రోబోలు


అయితే, రోబోలు తలకిందులై తపస్సు చేసినా కొన్ని పనులు చేయలేవు. అందులో అత్యంత ప్రధానమైనది మానవ సృష్టి. ఇది అందరికి తెలిసిందే. దీనితో పాటు.. పలు ఉద్యోగాలను అవి చేయలేవు. అవేంటంటే.. కేర్‌గివర్స్(సంరక్షకులు), నర్సులు, డాక్టర్లు, సేల్స్ ఉద్యోగులు చేసే పనులు. వీటిని ఎప్పటికీ రోబోలు భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మనిషికి భావోద్వేగ బంధం చాలా ముఖ్యమని, ఆ బంధాన్ని, మానసిక ఉల్లాసాన్ని రోబోలు పంచలేవని ఘంటాపథంగా వ్యాఖ్యానిస్తున్నారు.

రోబో ఈ పనులు కూడా చేయలేదు..

  • సందర్భాన్ని అనుసరించి న్యాయం చెప్పలేదు

  • ఉత్కంఠను రేపే ఆటలు ఆడలేదు
  • కొత్త పాటలు, ట్యూన్లు కనుగొనలేదు

  • వావ్.. అనిపించే పెయింటింగ్‌లకు శ్రీకారం చుట్టలేదు

  • తన సాంకేతికతనే అడ్వాన్స్‌డ్‌గా మార్చుకోలేదు

Published by: Shravan Kumar Bommakanti
First published: May 8, 2019, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading