గతంలో మొబైల్ నెంబర్‌కు రీఛార్జ్ చేస్తే ఔట్‌గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ వచ్చేవి. ఆ తర్వాత డేటా బెనిఫిట్స్ కూడా అందించడం ప్రారంభించాయి టెలికామ్ కంపెనీలు. అయితే టెలికామ్ కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో యూజర్లకు కొత్తకొత్త బెనిఫిట్స్ అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి వీడియో స్ట్రీమింగ్ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కాంప్లిమెంటరీగా అందిస్తున్నాయి రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi). కాబట్టి యూజర్లు అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ మళ్లీ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కోసం ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.
Jio Rs 3119 Plan: జియో రూ.3,119 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 730 జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
WhatsApp: మీ అకౌంట్ బ్యాలెన్స్ వాట్సప్‌లో తెలుసుకోండి ఇలా
Jio Rs 1066 Plan: జియో రూ.1,066 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 799 Plan: జియో రూ.799 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 112జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 601 Plan: జియో రూ.601 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. జియో యాప్స్‌తో పాటు రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Tecno Spark Go 2022: టెక్నో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... ధర రూ.8,000 లోపే
Airtel Rs 299 Plan: ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఒక నెల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Airtel Rs 599 Plan: ఎయిర్టెల్ రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్రైమ్ మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.
Vi Rs 601 Plan: వొడాఫోన్ ఐడియా రూ.601 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 16జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Vi Rs 901 Plan: వొడాఫోన్ ఐడియా రూ.901 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 70 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 48జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, Vodafone Idea