Best Camera Phones: హై క్వాలిటీ కెమెరా స్మార్ట్​ఫోన్​ కొంటారా..అతి తక్కువ ధరలో..మీకోసం..

camera smartphones

ఇప్పుడు స్మార్ట్​ఫోన్​లోని కెమెరాకు ప్రాధాన్యత పెరిగింది. మిగతా అన్ని ఫీచర్లను పక్కనపెట్టి ఒక్క కెమెరా క్వాలిటీ చూసే స్మార్ట్​ఫోన్​ను సెలక్ట్ చేసుకునే వారున్నారంటే అతిశయోక్తి లేదు.

  • Share this:
Best Camera Phones: ఒకప్పుడు ఫోన్​ అంటే దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడుకోవడానికి పనికొచ్చే డివైజ్. కానీ, స్మార్ట్​ఫోన్ల రాకతో దీనర్థం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్మార్ట్​ఫోన్​లోని కెమెరాకు ప్రాధాన్యత పెరిగింది. మిగతా అన్ని ఫీచర్లను పక్కనపెట్టి ఒక్క కెమెరా క్వాలిటీ చూసే స్మార్ట్​ఫోన్​ను సెలక్ట్ చేసుకునే వారున్నారంటే అతిశయోక్తి లేదు.(Top 10 mobile phones 2021) ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్​ ప్రారంభమైంది. దసరా, దీపావళి, క్రిస్టమస్​ ఇలా వరుసగా పండుగలు రాబోతున్నాయి. మీ కుటుంబంతో గడిపే ఈ మధుర క్షణాలను కెమెరాల్లో బంధించాలంటే మీకు హై క్వాలిటీ కెమెరా గల స్మార్ట్​ఫోన్​ అవసరం. ప్రస్తుతం సరసమైన ధరలోనే మంచి కెమెరా క్వాలిటీ గల స్మార్ట్​ఫోన్లు లభిస్తున్నాయి. ఆ జాబితాను పరిశీలిద్దాం. (Best Mobile Phones )

Whatsapp Future: వాట్స‌ప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్‌.. వాయిస్ మెసేజ్ ఇక‌ సుల‌భం


శామ్సంగ్​ గెలాక్సీ S21 సిరీస్ (top 10 mobiles to buy in India in 2021)


శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ప్రస్తుతం అగ్రశ్రేణి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్​ సిరీస్​గా కొనసాగుతోంది. ఈ సిరీస్​లోని అన్ని ఫోన్లలో ఉత్తమ కెమెరాను అందించారు. శామ్‌సంగ్ గెలాక్సీ S21, S21+ వెనుక భాగంలో 12MP+12MP+64MP కెమెరా సెటప్‌ను అందించారు. ఇవి మీకు అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్​, ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని ఇస్తాయి. బెస్ట్​ కెమెరా క్వాలిటీ కోసం ఇదే సిరీస్​లోని S21 అల్ట్రాను కూడా పరిగణించవచ్చు.

ఐఫోన్​ 13 ప్రో, 13 ప్రో మాక్స్​

యాపిల్​ ఐఫోన్లకు ప్రపంచ మార్కెట్​లో ఉండే క్రేజే వేరు. వీటిలోని అద్భుతమైన ఫీచర్లే యాపిల్​ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి. కాస్త ధర ఎక్కువైనా మంచి కెమెరా క్వాలిటీ గల స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటే ఐఫోన్​ 13 ప్రో లేదా 13 ప్రో మాక్స్​ బెస్ట్​ ఆప్షన్​గా చెప్పవచ్చు. ఈ ఫోన్లు 12MP ట్రిపుల్ ​కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్​ 13 సిరీస్ సెన్సార్ షిఫ్ట్, మాక్రో మోడ్, కొత్త సినిమాటిక్ మోడ్ వంటి ఫీచర్లతో అద్భుతమైన కెమెరా అనుభవాన్ని అందిస్తాయి.

Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రూ.7,000 డిస్కౌంట్


షియోమి ఎంఐ 11 అల్ట్రా

షియోమి సంస్థ నుంచి ఇటీవల విడుదలైన ఎంఐ 11 అల్ట్రాలో శక్తివంతమైన కెమెరాను అందించింది. ఇది 50MP + 48MP + 48MP ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఈ కెమెరాల సహాయంతో హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు తీయవచ్చు.

వన్‌ప్లస్ 9 ప్రో

వన్‌ప్లస్ 9 ప్రో కెమెరా కోసం ప్రత్యేకంగా హాసెల్‌బ్లాడ్‌తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో 48MP + 50MP + 8MP ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్‌ను అందించింది. ఈ కెమెరాల సహాయంతో హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు తీయవచ్చు.

వివో X70 ప్రో+

వివో ఎక్స్​- సిరీస్​లోని ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్లలో వివో X70 ప్రో ప్లస్​ ప్రధానమైనది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్​లో అద్బుతమైన కెమెరాలను అందించింది. వెనుకవైపు నాలుగు ఓఐఎస్​ కెమెరాలను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్​తో రూపొందించింది. ఇవి హై క్వాలిటీ చిత్రాలను, అలాగే వీడియోను క్యాప్చర్ చేస్తాయి.
Published by:Krishna Adithya
First published: